Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.. లోకేష్ పాదయాత్ర బందోబస్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో రమేష్ కుప్పకూలాడు.. వెంటనే అప్రమత్తమైన సహచర పోలీసులు.. అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, రమేష్.. ఐరాల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసేవారు. పాదయాత్ర కాన్వాయ్ నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. కాగా, కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర 14వ రోజుకు చేరింది..
జీడి నెల్లూరు నియోజకావర్గం, రంగాపురం క్రాస్ వద్ద లోకేష్ మాట్లాడుతూ.. పరదాలు లేకుండా బయటకి రాలేని జగన్, నా పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు.. జగన్ సహకరిస్తే పాదయాత్ర, సహకరించకపోతే దండయాత్ర చేస్తానని ప్రకటించారు.. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి వందల మంది పోలీసులా? అని ప్రశ్నించారు. ఒక పోలీసు అధికారి రఘురామిరెడ్డి అత్యుత్సాహం చూపిస్తున్నాడు, అధికారంలోకి వచ్చేది మేమే, అప్పుడు చూపిస్తాం అని హెచ్చరించారు.. 2024లో ఐపీఎస్ అధికారులు జైలుకు వెళ్లి కార్యక్రమాలు ఉండబోతున్నాయని వార్నింగ్ ఇచ్చారు.. ఏ పోలీసులు అయితే రాజారెడ్డి రాజ్యాంగ అమలు చేస్తున్నారో వారు జైలుకే.. నా పైన 19 కేసులు పెట్టారు, ఎన్నైనా పెట్టుకో నేను భయపడనన్న లోకేష్.. ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆరోపించారు.. ఎన్నికల ముందు పెంచుకుంటు పోతాను అంటే ఏమో అనుకున్నాము, కానీ నిత్యావసర వస్తువులు, మద్యం, కరెంట్ బిల్, పన్నులు పెంచుకుంటూ పోతున్నారని.. మనం పీల్చే గాలికి పన్ను వేస్తారేమో? అని ఎద్దేవా చేశారు నారా లోకేష్.
మరోవైపు.. లోకేష్ పాదయాత్ర పై మంత్రి వేణు సైటర్లు వేశారు.. లోకేష్ దొడ్డి దారిన మంత్రి అయ్యాడని విమర్శలు గుప్పించిన ఆయన.. చంద్రబాబు సభలో ఏడుగురి చావు కి కారణం అయ్యాడు.. ఇప్పుడు లోకేష్ కానిస్టేబుల్ ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అసలు రాష్ట్రంలో ఏమి లోటు ఉందని లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు అంటూ నిలదీశారు మంత్రి వేణు..