Baby Girl Sale: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కలకలం.. రూ.1.90 లక్షలకు చిన్నారి విక్రయం..
- గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి విక్రయం..
- 1.90 లక్షల రూపాయలకు ఆడ శిశువు విక్రయించిన తండ్రి..
- బిడ్డ పుట్టి చనిపోవడంతో తీవ్ర మనోవేదనలో ఉన్న స్నేహితురాలి కోసం డీలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby Girl Sale: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి విక్రయం ఘటన కలకలం సృష్టించింది.. 1.90 లక్షల రూపాయలకు తన బిడ్డను విక్రయించారు చిన్నగంజాంకు చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి.. కొద్ది రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తన భార్య లక్ష్మిని డెలివరీ కోసం తీసుకెళ్లాడు భర్త సుబ్రహ్మణ్యం.. అయితే, ఆడ శిశువుకు జన్మనిచ్చిన సుబ్రమణ్యం భార్య లక్ష్మి కన్నుమూసింది.. గతంలోనే లక్ష్మికి ఎనిమిది మంది సంతానం ఉంది.. మరోవైపు.. అదే ఆస్పత్రిలో డెలివరీ కోసం భట్టిప్రోలుకు చెందిన మీరాభి చేరింది.. కానీ, డెలివరీ తర్వాత మీరాభికి పుట్టిన శిశువు ప్రాణాలు విడిచింది.. అదే సమయంలో మీరాభి స్నేహితురాలు ప్రభావతి.. సుబ్రమణ్యంతో చిన్నారి కోసం సంప్రదింపులు జరిపింది.. ఇక, తన పాపను ఇచ్చేందుకు సుబ్రమణ్యం అంగీకరించారు.. ఈ నెల 7వ తేదీన సుబ్రహ్మణ్యాన్ని ఒప్పించి శిశువును తీసుకువెళ్లేందుకు చిన్నగంజాంకు వచ్చింది మీరాభి కుటుంబ సభ్యులు.. ఎట్టకేలకు సుబ్రహ్మణ్యాన్ని ఒప్పించి శిశువుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు మీరాభి కుటుంబ సభ్యులు.
Read Also: Manipur : మణిపూర్లో మళ్లీ కర్ఫ్యూ, ఇంటర్నెట్ నిషేధం.. 2000మంది సైనికుల మోహరింపు
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
బిడ్డ పుట్టి చనిపోవడంతో, తీవ్ర మనోవేదనలో ఉన్న తన మిత్రురాలు మీరాభికి సుబ్రహ్మణ్యం వద్ద కొనుగోలు చేసిన శిశువును తీసుకువచ్చి ఇచ్చింది స్నేహితురాలు ప్రభావతి.. అయితే, బిడ్డ పుట్టి చనిపోయిన మహిళ వద్ద మరో బిడ్డను చూసి అనుమానం వచ్చి ప్రశ్నించారు జీజీహెచ్ సిబ్బంది.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. ఇక, పోలీసుల విచారణను బిడ్డను 1.90 లక్షలకు కొనుగోలు చేసినట్లు ప్రభావతి ఒప్పుకుంది.. శిశువు కొనుగోలుపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును చినగంజం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు కొత్తపేట పోలీసులు.. మొత్తంగా తన తనకు పుట్టిన బిడ్డ కన్నుమూయడంతో.. తీవ్ర మనోవేధనతో ఉన్న స్నేహితురాలిని ఓదార్చేందుకు ప్రభావతి ప్రయత్నించింది.. ఇప్పుడు పోలీసు కేసులు చిక్కుకుంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!