గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి గోరంట్లకు చెందిన షేక్ నసీమా అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ మహిళ జీజీహెచ్‌కు చేరుకుని.. బిడ్డ బాగున్నాడు అంటూ చేతిలోకి తీసుకొని అక్కడి నుంచి పరారైంది.
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి విక్రయం ఘటన కలకలం సృష్టించింది.. 1.90 లక్షల రూపాయలకు తన బిడ్డను విక్రయించారు చిన్నగంజాంకు చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి.. కొద్ది రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తన భార్య లక్ష్మిని డెలివరీ కోసం తీసుకెళ్లాడు భర్త సుబ్రహ్మణ్యం.. అయితే, ఆడ శిశువుకు జన్మనిచ్చిన సుబ్రమణ్యం భార్య లక్ష్మి కన్నుమూసింది.. గతంలోనే లక్ష్మికి ఎనిమిది మంది సంతానం ఉంది.. మరోవైపు.. అదే ఆస్పత్రిలో డెలివరీ కోసం భట్టిప్రోలుకు చెందిన మీరాభి…