Gudivada Amarnath Fires On Chandrababu & Pawan Kalyan: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు బాగా అబద్ధాలు చెబుతున్నారని.. ఇన్నాళ్లూ ముసుగులో కలిసిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు బయటకు వచ్చారని విమర్శించారు. ఇప్పటివరకూ కొనసాగించిన తమ అక్రమ సంబంధానికి ముగింపు పలికి.. ఇప్పట్నుంచి కొత్త బంధానికి తెరతీశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఇన్నాళ్లూ ప్రజలను ఎందుకు మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. విశాఖలో జరిగిన సంఘటనకు, వీళ్లు చెబుతున్న మాటలకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. దాడి చేసిన వారిని పరామర్శించటానికి చంద్రబాబుకు సిగ్గుందా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకపోతే.. ఇప్పుడు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. ‘ప్యాకేజీ తీసుకున్నావని చెప్తే.. చెప్పుతో కొడతావా? మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చెప్పిందే నిజం చేశావుగా!’ అని వ్యాఖ్యానించారు.
కాపు కులాన్ని తీసుకుని వెళ్లి చంద్రబాబుకు అమ్మేద్దామని పవన్ చూస్తున్నాడని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ది కాపు కులమో కాదో తెలీదు కానీ.. అది చంద్రబాబుకి మాత్రం అనుకూలంగా మారుతుందన్నారు. రాష్ట్రంలో నువ్వు ఒక్కడివే చెప్పులు వేసుకుని తిరుగుతున్నావా? మాకు చెప్పులు లేవా? అని పేర్కొన్నారు. భీమవరం, గాజువాకలో ప్రజలు నీకు ఇచ్చిన తీర్పునే చెప్పుతో కొట్టడం అంటారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌ది మూడు పెళ్లిళ్ల సిద్ధాంతమని.. పెళ్ళి చేసుకుని రెండు, మూడేళ్లు గడిపేసి.. డబ్బులిచ్చి వదిలించుకోమని పవన్ చెబుతున్నాడని ఆరోపణలు చేశారు. మూడో భార్య కూడా పవన్‌ని వదిలేసి ఉంటుందని, అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నాడని అన్నారు. చంద్రబాబుకు పవన్ స్టెఫనీనో, పవన్‌కు చంద్రబాబు స్టెఫనీనో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుకు అమ్ముడుపోయాడన్న మాటను పవన్ ఇవాళ రుజువు చేశాడన్నారు. రాష్ట్ర ముఖచిత్రం మారబోతోందన్న పవన్.. రేపటి దాకా కూడా ఆగలేకపోయాడన్నారు.
నీది కాపుల జనసేన కాదు కమ్మ జనసేన అని పవన్‌పై అమర్నాథ్ ఘాటు విమర్శలు గుప్పించారు. తాము ఒక మిషన్ పూర్తి చేశామన్న ఆనందం నాదెండ్ల మనోహర్, చంద్రబాబు ముఖాల్లో కనిపించిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నాదెండ్ల మనోహర్ డైరెక్టర్ అయితే.. చంద్రబాబు ప్రొడ్యూసర్ అని పేర్కొన్నారు. రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు బయటకు రాకుండా చేయాలన్నదే చంద్రబాబు, పవన్ లక్ష్యమన్నారు. విశాఖపట్నం ఎట్టిపరిస్థితుల్లో రాజధాని అవుతందని అమర్నాథ్ చెప్పారు.