విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పర్యటించారు. జనసేన మండల నాయకులతో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం అవకాశం ఇస్తే విశాఖ ఎంపీగా పోటీ చేస్తానన్నారు. జనసేన-టీడీపీతో పొత్తుపై మా అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
జగన్ వల్ల ఏపీ బ్రాండ్ డామలిష్ అయింది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పాడింది.. వైసీపీ అరాచకాలను సామాన్యులు మొజలకుని నా వరకు పవన్ కళ్యాణ్ వరకు భరించామన్నారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ సీట్లు రావడం ఖాయమని స్పష్టం చేశారు జనసేన నేత, సినీ నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్.
TDP-Janasena Alliance: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ-జనసేన మరింత వేగం పెంచుతోంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ కాగా.. నేడు అమరావతిలో మరోసారి సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఇద్దరు నేతలు కీలక చర్చలు చేస్తున్నారు. Also…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కలిసే వస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని, వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.