Rohingya Genocide: రోహింగ్యాలను కావాలనే చంపారు..తేల్చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు తమ ఇళ్లలో నవ్వుతూ బతికిన మనుషులు.. ఇప్పుడు ఎక్కడో ఒక శరణార్థి శిబిరంలో తమ ఊరిని గుర్తుచేసుకుంటూ బతుకుతున్నారు. తమ పిల్లలు పెరిగిన నేలను, తమ వాళ్లు నడిచిన వీధులను, తమ ఇంటి గడపను మళ్లీ చూడగలమో లేదో తెలియని ఎదురుచూపు వాళ్లది. ఇన్నాళ్లకు ఆ కన్నీళ్లకు ప్రపంచం ముందు ఒక గుర్తింపు దొరికింది.
రోహింగ్యాలపై మయన్మార్ మారణహోమానికి పాల్పడిందని అంతర్జాతీయ న్యాయస్థానం తేల్చింది. హేగ్‌లో వెలువడిన ఈ తీర్పు రోహింగ్యాల సుదీర్ఘ పోరాటంలో ఒక పెద్ద మలుపు. ఒక దేశం మారణహోమానికి పాల్పడిందని ప్రపంచ న్యాయస్థానం తేల్చడం ఇదే తొలిసారి. ఈ తీర్పును మార్చే అవకాశం కూడా ఉండదు. ఇక ఈ తీర్పు వెనుక ఎన్నో ఏళ్ల కన్నీళ్లు ఉన్నాయి. ఆ కన్నీళ్లకు కారణమైన ఒక భయంకరమైన గతం ఉంది.
Also Read
- Marriages: "పెళ్లి వద్దు.. సింగిల్ లైఫే బెటర్".. యువత పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటోంది? 4 ప్రధాన కారణాలివే..
- International Men's Day: "నువ్వు మగాడివి.. ఏడవకూడదు".. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
- Iran vs America: ఇరాన్ డర్టీ బాంబ్.. అమెరికాలో అలెర్ట్!
- El Nino: 1997ను మించిన విధ్వంసం.. నాసా బిగ్ వార్నింగ్
2017 ఆగస్టులో మయన్మార్‌లోని రఖైన్ ప్రాంతంలో రోహింగ్యాల జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఆ దేశ సైన్యం గ్రామాల మీద విరుచుకుపడింది. ఇళ్లకు నిప్పుపెట్టింది. కళ్లముందే మనుషులను చంపింది.
మహిళలపై అత్యాచారాలు జరిగాయి. చిన్న పిల్లలు కూడా ఆ హింస నుంచి తప్పించుకోలేకపోయారు. ఒక్కసారి ఊహించండి.. నిన్నటివరకు మన పిల్లలు ఆడుకున్న ఇల్లు, మన కుటుంబం కలిసి భోజనం చేసిన గది, మన జీవితమంతా గడిచిన ఊరు.. కళ్లముందే మంటల్లో కాలిపోతుంటే ఆ మనిషి గుండె ఎంతగా పగిలిపోతుంది? ప్రాణాలు కాపాడుకోవడం కోసం 7లక్షలకు పైగా రోహింగ్యాలు తమ ఇళ్లను వదిలి బంగ్లాదేశ్‌కు పారిపోయారు. కొందరు నడుచుకుంటూ వెళ్లారు. మరికొందరు దారిలోనే తమ వాళ్లను కోల్పోయారు. చివరకు శరణార్థి శిబిరాలల్లోనే కొత్త జీవితాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. సొంత ఇల్లు లేని జీవితం.. రేపు ఏమవుతుందో తెలియని బతుకు. ఈ అన్యాయంపై ప్రపంచం స్పందించాలని గాంబియా ముందుకొచ్చింది.
2019 నవంబర్‌లో మయన్మార్‌పై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసింది. రోహింగ్యాలపై జరిగిన దాడులు ఒక జాతిని అంతం చేసే ప్రయత్నమని వాదించింది. ఆ మారణకాండతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేని గాంబియా, ప్రపంచ దేశాలన్నీ అంగీకరించిన మారణహోమం నిరోధక ఒప్పందం ఆధారంగా ఈ పోరాటాన్ని మొదలుపెట్టింది.
ఏళ్ల తరబడి సాగిన విచారణలో సైన్యం చేసిన దాడుల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని న్యాయస్థానం పరిశీలించింది. మనుషులను చంపడం, శరీరాలను, మనసులను గాయపరచడం, ఆ సమూహంలో పిల్లలు పుట్టకుండా అడ్డుకునే చర్యలు.. ఇవన్నీ ఒక పథకం ప్రకారం జరిగాయని గుర్తించింది. రోహింగ్యాలను పెద్ద సంఖ్యలో అంతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు జరిగాయని కోర్టు నిర్ధారించింది. అందుకే మయన్మార్‌ను దోషీగా నిలబెట్టింది. జరిగిన దారుణాలపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని ఆదేశించింది. రోహింగ్యాలు తమ ఇళ్లకు సురక్షితంగా తిరిగి వెళ్లేలా చేయాలని, విడిపోయిన కుటుంబాలను కలపాలని, బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా చెప్పింది.
అయితే ఇక్కడితో వాళ్ల కష్టాలు ముగిసిపోలేదు. 2021లో మయన్మార్ సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి ఆ దేశంలో హింస కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రఖైన్ ప్రాంతంలో సైన్యంతో పాటు అరాకాన్ ఆర్మీ నుంచి కూడా రోహింగ్యాలు దాడులు ఎదుర్కొంటున్నారు.
బలవంతంగా పనులు చేయించడం, అకారణంగా నిర్బంధించడం వంటి హింస ఇంకా కొనసాగుతోంది. అంటే.. ఒకప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయిన ప్రజలకు, ఇప్పటికీ తమ భవిష్యత్తుపై భరోసా లేదు. ప్రపంచ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది కానీ ఆ తీర్పును అమలు చేయించడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చర్యలు తీసుకునే అధికారం ఉంది. ప్రపంచ దేశాలు మయన్మార్‌పై ఒత్తిడి తీసుకురావచ్చు. ఇన్నేళ్లుగా జరగని న్యాయం ఇప్పుడు నిజంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత వాటిపైనే ఉంది. ఎందుకంటే ఒక మనిషి తన ఇంటిని కోల్పోతే మరో ఇల్లు కట్టుకోవచ్చు. తన ఆస్తిని కోల్పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. కానీ ఒక జాతి తన నేలనే, తన గుర్తింపునే, తన వాళ్లనే కోల్పోతే.. ఆ నష్టాన్ని ఎవరు పూడ్చగలరు?
ఈ రోజు హేగ్‌లో వినిపించిన తీర్పు.. రోహింగ్యాల జీవితాల్లో కూడా వినిపించాలి. ఒక రోజు వాళ్లు శరణార్థులుగా బతికిన గుడారాల నుంచి బయటకు వచ్చి, తమ సొంత ఇంటి గడపపై మళ్లీ అడుగుపెట్టాలి. అప్పుడే ఈ తీర్పు కాగితాల మీద మిగిలిపోకుండా.. మనుషుల జీవితాల్లో వెలుగవుతుంది.
తాజావార్తలు
-
Rohingya Genocide: రోహింగ్యాలను కావాలనే చంపారు..తేల్చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Chittoor Municipal Corporation: చిత్తూరు కార్పొరేషన్లో ట్విస్ట్.. ప్రమాణ స్వీకారానికి ముందే వైసీపీ కార్పొరేటర్ రాజీనామా
-
Kaviya Maran: తన ఉద్యోగులకు ఆరెంజ్ ఆర్మీ క్వీన్ సర్ప్రైజ్ గిఫ్ట్.. పెళ్లి కానుక బాక్స్ వీడియోలు వైరల్..
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!