ఏపీలో రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో అల్లర్ల గురించి ఆయన స్పందిస్తూ.. అంబేద్కర్ పేరు కోనసీమ ప్రాంతానికి పెట్టడం చిన్న విషయం అని.. అంబేద్కర్ లాంటి మహనీయుడి పేరును రాష్ట్రాలకు పెట్టాలని సూచించారు. అంబేద్కర్ జీవితం ఇప్పటి నేతలకు ఆదర్శమన్నారు. వైసీపీ చేసిన బస్సు యాత్ర తుస్సుమందన్నారు. వైసీపీ మంత్రుల బస్సు యాత్రకు ప్రాధాన్యత లేదని.. కనీసం వారి మాటలు వినడానికి జనాలు లేరని చురకలు…
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. తిరుపతి ఎయిర్‌పోర్టు ఉద్దేశపూర్వకంగా నీటి సరఫరా నిలిపివేతపై ఫిర్యాదు చేశారు.విమానాశ్రయానికి నీటి సరఫరా నిలిపివేతపై విచారణ చేపట్టాలని కోరిన జీవీఎల్ నరసింహరావు. ఈవారం ప్రారంభంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మరియు విమానాశ్రయ సిబ్బంది నివాస గృహాలకు నీటి సరఫరాను అకస్మాత్తుగా నిలిపివేశారని లేఖలో పేర్కొన్నారు. జనవరి 10న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ హఠాత్తుగా విమానాశ్రాయనికి నీటి సరఫరాను నిలిపి వేసిందన్నారు. అధికార వైసీపీ పార్టికి…
తిరుపతి విమానాశ్రయ ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది.. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ చేయనున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి విమానాశ్రయం కూడా ఒకటి. ప్రైవేటుపరం కానున్న మొత్తం 13 విమానాశ్రయాల్లో చిన్నవి ఏడింటినీ మిగిలిన ఆరు పెద్ద విమానాశ్రయాలతో విలీనం చేయనున్నారు. తిరుచ్చి విమానాశ్రయ పరిధిలోకి తిరుపతి విమానాశ్రయం రానుంది. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, విమానాల సర్వీసుల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోంది. విశాఖపట్నం, విజయవాడ తర్వాత ఏపీలో అత్యధిక…