FlipKart: దసరా, దీపావళి వంటి పండగలు వస్తుండటంతో చాలా మంది షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో బిగ్గెస్ట్ సేల్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు కమింగ్ సూన్ అంటూ ఫ్లిప్‌కార్ట్ ప్రకటన చేసింది. అయితే ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి 30 మధ్య ఉంటుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ ఫోన్ నుంచి స్టార్ట్ టీవీ వరకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఉంటాయని తెలుస్తోంది. రూ.99 విలువ చేసే చిన్న చిన్న వస్తువులు మొదలు రూ.1 లక్ష విలువ చేసే లగ్జరీ వస్తువుల వరకు ఈ సేల్ ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్ సూచించింది.
Read Also: Viral Video: యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ క్రేజ్..
స్మార్ట్ ఫోన్లు, గేమింగ్ ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్, మానిటర్స్, మొబైల్ యాసెసరీస్, ట్రిమ్మర్స్, హెడ్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్యాన్లు, గీజర్లు,ఇతరత్రా గృహోపకరణాలపై 80 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు వాడితే 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ సేల్ 24 గంటల ముందే ఫ్లిప్ కార్ట్ ప్లస్ వినియోగదారులు కొనుగోలు చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌లు సైతం విక్రయాలు జరగనున్నాయి. ఐఫోన్‌లు సహా రియల్ మీ, పోకో, వివో, శాంసంగ్ వంటి ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకే సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
