కరిచింది పెంపుడు కుక్కే కదా అని చేసిన నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణాన్ని కోల్పోయింది. కుక్కకు రాబిస్ సోకిన విషయం తెలుసుకోకపోవడంతో వ్యాక్సిన్ వేసుకోవడంలో ఆలస్యం వల్ల ప్రాణాల మీద తెచ్చుకున్నాడు యువకుడు. ఈ విషాదం విశాఖ జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది. తండ్రి నర్సింగరావు ఆర్టీసీలో కండక్టర్ గా పని చేసి గత ఎనిమిదేళ్లుగా పెరాలిసిస్ వచ్చి మంచానికే పరిమితం అయ్యారు. కుమారుడు భార్గవ్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు.
పేదల భవిష్యత్ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి.. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్ రావాలని చెప్పండి.. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి.. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి.. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే.. ప్రజలే.. నా స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం వైఎస్ జగన్.. భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చాయి వైసీపీ శ్రేణులు.. సిద్ధం పేరుతో నిర్వహించిన ఈ సభా వేదిక నుంచి.. యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.. వారి నుంచి సిద్ధం అంటూ సమాధానాన్ని రాబట్టారు..
ఓ మాజీ సైనికుడిపై హత్యా యత్నానికి తెగబడ్డా పట్టించుకోరా? అని జగన్ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. భూ కబ్జాలపై ఫిర్యాదు చేశాడనే దారుణానికి ఒడిగట్టారు.. ఈ ఇష్యూన్ని కేంద్రీయ సైనిక్ బోర్డు దృష్టికి తీసుకువెళ్తాం.