మహిళలకు అదరిపోయే శుభవార్త ఇది. ఎందుకంటే.. సిలిండర్ పేలడం దానివల్ల జరిగి ప్రమాదం గురించి ఎప్పుడూ ఇంట్లో ఏదో టెన్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ టెన్షన్ పడొద్దంటోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్). ఇంట్లో సిలిండర్ పేలి ప్రమాదం జరగడం లాంటి సంఘటన మనం ఎన్నో చూసుంటాం. అయితే.. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండేన్ పేరిట గ్యాస్ సిలిండర్‌లను సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు బ్లాస్ట్ ఫ్రూఫ్ సిలిండర్‌ను ప్రవేశపెట్టింది ఐఓసీఎల్. ఈ సిలిండర్ ఎంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా పేలదని సంస్థ ప్రకటించింది. అయితే.. ప్రస్తుతం ఇంటి కోసం వాడే గ్యాస్ సిలిండర్లు 14 కేజీలలో వస్తుండగా.. ఈ బ్లాస్ట్ ఫ్రూఫ్ సిలిండర్‌లు మాత్రం 10 కేజీలలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. సోమవారం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మేయర్ గుండు సుధారాణి ఈ సిలిండర్‌ను ఆవిష్కరించారు.