Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోగానే కాకుండా ప్రత్యేక పాత్రలైనా, మల్టీస్టారర్ అయినా టక్కున ఓకే చెప్పి టాలీవుడ్ రేలంగి మామయ్య గా మారిపోయాడు వెంకీ మామ. ఇక తాజాగా ఓరి దేవుడా చిత్రంలో వెంకీ.. దేవుడు పాత్రలో నటించిన విషయం విదితమే. తమిళ్ లో విజయ్ సేతుపతి నటించిన పాత్రలో తెలుగులో వెంకీ కనిపించాడు. నిజం చెప్పాలంటే వెంకీ ఉండడం వలనే ఈ సినిమా మంచి హైప్ తెచ్చుకున్నది అనేది నమ్మదగ్గ విజయం. కాగా ఈ పాత్ర కోసం వెంకీ మామ బాగానే పారితోషికం తీసుకున్నాడట.
కేవలం 15 నిముషాలు కనిపించినందుకు రూ. 3 కోట్లు అందుకున్నాడని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం కేవలం వెంకీ మామ 5 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడట. ప్రస్తుతం మార్కెట్ ను బట్టి వెంకీ మామ సినిమాలు అంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రికార్డ్ కలక్షన్స్ రాబట్టొచ్చని నిర్మాతలు సైతం అంత పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాతలు అనుకున్నట్లే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా మంచి కలక్షన్స్ కూడా రాబడుతోంది. మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులు అందుకోనున్నదో చూడాలి. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన ఈ సినిమాకు అశ్వత్ దర్శకత్వం వహించాడు.