IAS officers Transferred: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని 8 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చి బదిలీ చేశారు. బదిలీ అయిన ఐఏఎస్ ల వివరాలు ఇవే..
తెలంగాణలో 8 మంది ఐఏఎస్ బదిలీలు..
* షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ కమిషనర్ గా TK శ్రీదేవి.
* కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా రిస్వి ఐఏఎస్ కు అదనపు బాధ్యతలు.
* రెవిన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాయింట్ సెక్రెటరీగా హరీష్ ఐఏఎస్.
* ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు తనకు బాధ్యతలు టి హరీష్ ఐఏఎస్ కు అప్పగించిన ప్రభుత్వం.
* మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్ కుమార్ ఐఏఎస్.
* MAUD డిప్యూటీ సెక్రటరీగా చెక్క ప్రియాంక ఐఏఎస్.
* HACA లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చంద్రశేఖర్ రెడ్డి.
* మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
Read also: Rashmika Mandanna: వయనాడ్ బాధితులకు రష్మిక సాయంపై ట్రోలింగ్?
మరోవైపు జూలై 20న రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ అయిన విషయం తెలిసిందే.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏ శరత్‌కు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా, గృహనిర్మాణం మరియు సాధారణ పరిపాలన (స్మార్ట్ గవర్నెన్స్) శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వికాస్ రాజ్ నియమితులయ్యారు. జేఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్, స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మి నియమితులయ్యారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక కార్యదర్శిగా హరీశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ స్థానిక సంస్థల అదనపు కమిషనర్ రాధికా గుప్తా.మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 8 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది.
Read also: Health insurance: రూ.5 లక్షల వైద్య బీమాతో రూ.50 లక్షల విలువైన చికిత్స!
Cloudbursts: హిమాలయాల్లో క్లౌడ్ బరస్ట్.. కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న 1600 మంది..