ఏలూరు పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. గత త్రైమాసికంలో దొంగలు ఓ బైకును దొంగలించారు. నీలి అలివేణి అనే మహిళ తన తలసేమియా బాధిత కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉపయోగించిన బైక్ ను ఎత్తుకెళ్లారు. అయితే.. బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని తిరిగి అప్పగిస్తున్నప్పుడు ఆమె భావోద్వేగాలు కదిలించాయని చంద్రబాబు తెలిపారు.
ఐసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షాకు క్రికెట్ గాడ్, భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు కార్యదర్శిగా పురుషుల, మహిళల క్రికెట్‌కు సమాన ప్రాధాన్యత ఇవ్వడంలో జైషా చేసిన కృషిని సచిన్ ప్రశంసించారు.
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. దీంతో.. కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కాగా.. విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కాంస్య పతకం సాధించిన భారత జట్టుపై మోడీ గురువారం ప్రశంసలు కురిపించారు. ఈ ఘనత రాబోయే తరాలకు గుర్తుండిపోతుందని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. వైసీపీ నేతలు ఓటమి నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా.. కడపలో మాజీ డిప్యూటి సీఎం అంజాద్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ, నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ విజయం కోసం, తన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటర్ గా మొదలైన తన రాజకీయ ప్రయాణం.. రెండు…
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కానీ ఎన్డీయే 292 సీట్లు గెలుచుకుంది.
జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నితీష్‌కు మోడీ అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు ముఖ్యమంత్రిగా తొమ్మిదో సారి నితీష్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నితీష్‌తో పాటు బీజేపీకి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జేడీయూకు మద్దతిస్తున్న మరో ఆరుగురు కూడా మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్పీకర్ పదవి కూడా బీజేపీకే దక్కనున్నట్లు సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అని తెలిపారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు శుభాభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అంతేకాకుండా.. రాష్ట్రం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. ఈరోజు విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ‘అఖండ’ విజయాన్ని సొంతం చేసుకొని రికార్డుల కలక్షన్స్ ని కొల్లగొడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకొని చిత్ర పరిశ్రమకు ఊపుని ఇచ్చింది. ఇక ఈ చిత్ర విజయంపై టాలీవుడ్ స్టార్లు తమదైన రీతిలో స్పందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా అఖండ…