CM Revanth Reddy : మూసీ అణుబాంబు కంటే ప్రమాదంగా మారబోతోంది
- మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది
- మూసీ ఒకప్పుడు జీవనదిగా ఉండేది
- మూసీ పరివాహక ప్రాంతాల్లో నీళ్లు.. కూరగాయలు.. పాలు అన్నీ కలుషితమయ్యాయి
- మూసీ నీటితో పండించిన పంటలకు ధర లభించడం లేదు
- ఎంతో మందితో చర్చించిన తర్వాతే మూసీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్నాం :సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సాగిన పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి.. భీమలింగంకు పూజలు చేశారు. రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక మత్స్యకారులు, నేతన్నలతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది దుర్మార్గులు ఉంటారు.. అందులో బీఆర్‌ఎస్ ముందు ఉంటదని, బీఆర్‌ఎస్ వాళ్ళను పిలిచి నల్గొండ బాగుపడాలా వద్దా అని అడగండని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ మన కాళ్లల్లో కట్టే పెడుతున్నారని, మూసీ అణుబాంబు కంటే ప్రమాదంగా మారబోతోందని సీఎం రేవంత్ అన్నారు. మన జీవితంతో చెలగాటం ఆడుతుంటే… చైతన్యంగా ఉండాలా లేదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకడు అంటున్నాడు.. లక్ష 50 వేల కోట్లు మూసీకి పెడుతున్నారని, దాంట్లో 25 వేల కోట్లు రేవంత్ దోసిండు అంటున్నాడు.. ఓరి సన్నాసి.. నేను దోచుకోవాలి అంటే నల్గొండ ప్రజలు సొమ్ము అవసరమా.. నువ్వు తెచ్చిన ధరణిలో కోకాపేట పై ఫోకస్ పెడితే డబ్బులు వస్తాయని ఆయన అన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
నకిలీ బీజేపీ నేతకునా సూటి ప్రశ్న.. మోడీ గుజరాత్‌లో సబర్మతి నది నీ బాగుచేసుకున్నారు.. మరి నా తెలంగాణ లో మూసి నీ బాగు చేసుకోవద్దా.. అని సీఎం రేవంత్ అన్నారు. బుల్డోజర్‌లకు అడ్డం పంటారో చెప్పండి.. మా నల్గొండ వాళ్ళని పిలిచి మీ మీదినుండి బుల్డోజర్ తొలిస్తా రండి.. ధైర్యం ఉంటే.. తేది చెప్పండి.. మా వెంకన్న నీ బుల్డోజర్ ఎక్కిస్త.. మా సామ్యూల్ తో జెండా ఊపి తొక్కిస్త రండి.. అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో మీరు ఇంత ధైర్యం ఇచ్చాకా.. సంగెం శివయ్య ఆశీస్సులు ఇచ్చాకా బుల్డోజర్ లతో తొక్కించి ముందుకు పోతా.. ఎవడో ఇస్తే కుర్చీలో కూర్చో లే.. ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించారు.. మీరు అండగా ఉన్నారు.. మీరే అధికారం ఇచ్చారు అని ఆయన అన్నారు.
అంతేకాకుండా..’మీరు అధికారం ఇచ్చినప్పుడు మీ కష్టం లో మేము అండగా ఉండాలి కదా.. నీ బిడ్డ మూడు నెలలు జైల్లో ఉంటే పుట్టెడు దుఃఖం వచ్చింది కేసీఆర్.. మా ఆడబిడ్డలు.. పిల్లలు జీవితాంతం వికలాంగులు అయితున్నారు.. వాళ్ళ బాధ కనపడదా కేసీఆర్..నీకు పాపం తగులుతుంది.. బిల్లా రంగాల వైపు ఉంటారా ..? మూసీ ప్రక్షాళన వైపు ఉంటారా చెప్పండి.. నల్గొండ బీజేపీ.. బీఆర్‌ఎస్ వాళ్ళు వద్దు అంటే చెప్పండి.. చరిత్ర హీనులు గా మారిపోతారు.. మూపీ ప్రక్షాళన చేసి తీరుతాం.. భీమలింగమ్ శివయ్య కి 2 కోట్లు.. 30 రోజుల్లో ప్రాజెక్టు డిసైన్ పూర్తి ఆవుతుంది. వాడపల్లి నుండి పాదయాత్ర మొదలు పెడతా.. చార్మినార్ వరకు నడుస్త.. హరీష్.. కేటీఆర్ నడుద్దాం రండి.. జనవరి మొదటి వారంలో పాదయాత్ర చేద్దాం… రండి.. ఇవాళ్టి యాత్ర ట్రైలర్.. అసలు సినిమా జనవరిలో..’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Atchannaidu: మహిళలపై అసహ్యకరమైన పోస్టులు పెడితే.. అదే మీకు చివరి రోజు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..