CM Chandrababu: పోలవరం నాకు సెంటిమెంట్.. ఎక్కువ బాధ పడేది నేనే..
- పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలేలోపే పునరావాసం పూర్తి..
- 2027 నవంబర్ నాటికి పునరావాసం... డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి..
- 829 కోట్లు నేరుగా నిర్వాసితుల అకౌంట్లో జమ చేసిన ఘనత మాప్రభుత్వానిదే..
- మాది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వం..
- అర్హులైన ప్రతిఒక్కరికీ పరిహారం అందిస్తామని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పోలవరం నాకొక సెంటిమెంట్.. ప్రాజెక్టు విషయంలో ఎక్కువ బాధ పడేది నేనే అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.. ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన ఆయన నిర్వాసితులతో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడిచి పెట్టకముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తాం.. తర్వాతనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
Read Also: Deputy CM Pawan Kalyan: పిఠాపురంపై పవన్ కల్యాణ్ రివ్యూ.. కీలక సూచనలు
Also Read
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
పోలవరం పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం నిర్వాసితులతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 4,311 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. 2019లో వచ్చిన ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా మీ గురించి ఆలోచించడం కానీ, పట్టించుకోవడం కానీ చేయలేదని… కనీసం మీ సమస్యల పట్ల ఆలోచించిన దాఖలాలు కూడా లేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల అకౌంట్లలో 829 కోట్లు జమ చేశామని తెలిపారు.. 2019లో తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండుంటే 2020కి ప్రాజెక్టు పూర్తయ్యేదని.. ఆలస్యం చేయడం వల్ల ఖర్చు భారీగా పెరిగిపోయాందని తెలిపారు.. 400 కోట్లతో డయాఫ్రం వాల్ కడితే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిందని.. ఇప్పుడు మళ్లీ .990 కోట్లతో కొత్త డయాఫ్రంవాల్ నిర్మిస్తున్నాం అని వెల్లడించారు.
Read Also: Kannappa: అంత నమ్మకం ఉంటే ఈ శాపాలెందుకు?
2027 నాటికి పునరావాసాలు పూర్తి చేస్తామని.. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. కొందరి పేర్లు తొలగించారని బాధితులు చెబుతున్నారు… విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.. పునరావాసం కల్పించిన తర్వాత మీ ఆదాయ మార్గాలు, జీవన ప్రమాణాలు పెరగడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. వందేళ్లలో రెండువేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్ళింది.. 1940లో ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించారు.. అది సాధ్యం కాక ధవళేశ్వరం కట్టారు.. 2004లో పనులు ప్రారంభం అయిన లిటిగేషన్ లో పడింది.. విభన చట్టంలో పోలవరం అంశం ఉండటం తో నిర్మాణం సాధ్యం అవుతుందని నమ్మకం వచ్చింది.. కేంద్రం అపుడు ఇప్పుడు చాలా సాయం అందించింది.. 2019నాటికి 73శాతం పనులు పూర్తి చేశాం.. గిన్నీస్ రికార్డు స్థాయిలో కాంక్రీట్ పనులు చేశాం.. 22 సార్లు నేరుగా, 88 సార్లు వర్చువల్ గా ప్రాజెక్టు రివ్యూలు చేశాం.. కానీ, ఇపుడు ప్రాజెక్టు చూస్తుంటే బాధగా ఉంటుంది.. ఎలా ఉండాల్సిన ప్రాజెక్టు ఎలా తయారు చేశారు.. తెలియని తనం, అహంభావంతో ప్రాజెక్టు సర్వ నాశనం చేశారని ఫైర్ అయ్యారు..
తాజావార్తలు
-
Abqaiq Refinery Fire: ఇరాక్ డ్రోన్ దాడులు.. సౌదీ అరేబియాలోని అబ్కైక్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
-
Vadhandhi 2: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్‌కు సీక్వెల్.. ‘వధండి 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఈసారి హీరో మారిపోయాడు!
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!