New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం హువావే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో సరికొత్త సంచలనానికి తెరలేపింది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన తన సరికొత్త ఫ్లాగ్షిప్ ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ‘మేట్ ఎక్స్ టీ 2’ (Mate XT 2)ను అధికారికంగా ఆవిష్కరించింది. వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఈ ఫోన్లో అత్యాధునిక యు-షేప్ (U-shape) ఫోల్డింగ్ మెకానిజమ్‌ను ఉపయోగించారు. ఇది పూర్తిగా తెరిచినప్పుడు 10.2 ఇంచుల భారీ స్క్రీన్‌తో టాబ్లెట్లాగా మారిపోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను 19,999 యువాన్లుగా నిర్ణయించారు. దీని భారతీయ కరెన్సీ విలువ సుమారు రూ. 2.40 లక్షల వరకు ఉంటుంది.
ఈ ప్రీమియం ట్రై-ఫోల్డ్ డివైజ్ పనితీరును వేగవంతం చేయడానికి హువావే సొంతంగా అభివృద్ధి చేసిన కొత్త ‘కిరిన్ 9050 ప్రొ’ ప్రాసెసర్‌ను ఇందులో అమర్చింది. అత్యధిక మల్టీటాస్కింగ్, గేమ్స్, భారీ అప్లికేషన్లను సులభంగా రన్ చేయడానికి ఈ చిప్సెట్ ఎంతగానో తోడ్పడుతుంది. కెమెరా, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ పరంగా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్, గ్లోబల్ టెక్ ప్రియుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రారంభ ధర భారీగా ఉన్నప్పటికీ, ఇందులో అందించిన సాంకేతికత డిజైన్‌కు అనుగుణంగా ఉందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- Bharat Summit 2026: నేటి నుంచే భాగ్యనగరంలో ‘భారత్ సమ్మిట్’.. 70కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు..
- Delhi Air Pollution: ఊపిరి పీల్చుకోవడమే కష్టం.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి కాలుష్యం
- India vs New Zealand: నేడే నాలుగో వన్డే.. శ్రేయస్‌కు కెప్టెన్ పగ్గాలు.. టాస్, ఫ్రీ లైవ్ టెలికాస్ట్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- CII Partnership Summit: ఏపీ పారిశ్రామిక రంగానికి బూస్ట్.. 73 కంపెనీలతో కీలక ఒప్పందాలు.. లక్ష మందికి పైగా ఉద్యోగాలు
మరోవైపు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల విభాగంలో హువావేకి గట్టి పోటీ ఇచ్చేందుకు ఇతర దిగ్గజ సంస్థలు సైతం వేగంగా అడుగులు వేస్తున్నాయి. చైనాకే చెందిన ప్రముఖ బ్రాండ్ షియోమీ (Xiaomi) కూడా త్వరలోనే తమ సరికొత్త ఫోల్డబుల్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) కూడా ఈ రేసులో వెనుకబడకుండా, తమ తొలి ఫోల్డబుల్ మోడల్ ‘ఐఫోన్ ఆల్ట్రా’ ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పరిణామాలతో గ్లోబల్ మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల విభాగంలో పోటీ మరింత తీవ్రస్థాయికి చేరింది.
తాజావార్తలు
-
Ishan Kishan: టీమిండియాలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.. నా టార్గెట్ అదే!
-
ISRO PSLV Engine Test: వరుస వైఫల్యాల తర్వాత ఇస్రోకు భారీ విజయం.. పీఎస్ఎల్వీ మూడో దశ ఇంజిన్ టెస్ట్ సక్సెస్!
-
Bharat Summit 2026: నేటి నుంచే భాగ్యనగరంలో ‘భారత్ సమ్మిట్’.. 70కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు..
-
Xi Jinping Warns Taiwan: తైవాన్‌కు జిన్‌పింగ్ వార్నింగ్.. స్వాతంత్ర్యానికి అవకాశమే లేదు.. చైనాతో ఏకీకరణ తప్పదు!
-
Delhi Air Pollution: ఊపిరి పీల్చుకోవడమే కష్టం.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి కాలుష్యం
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!