Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sardar 2: తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీ, ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఎస్.జే. సూర్య.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సర్దార్ 2’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. గతంలో వచ్చిన ‘సర్దార్’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని, రెండో భాగం అంతకుమించిన ఎంటర్టైన్మెంట్ను అందిస్తుందని తెలిపారు. మిత్రన్ ఆలోచనా విధానం, కథను తెరకెక్కించిన తీరు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఎస్.జే. సూర్య పేర్కొన్నారు. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు సినిమాలో ఒక బలమైన సందేశం కూడా ఉంటుందని చెప్పారు.
ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను కథలో ప్రస్తావించినట్లు తెలిపారు. లియోనార్డో డికాప్రియో వంటి వారు చాలాకాలంగా పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తుచేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ‘సర్దార్ 2’ ద్వారా మిత్రన్ చెప్పే ప్రయత్నం చేశారని అన్నారు. “సినిమాను కేవలం చూసి థియేటర్లో వదిలేసి వెళ్లకండి. అందులోని మంచి సందేశాన్ని ఇంటికి తీసుకెళ్లాలి. మన జీవితంలో ఆలోచించాలి” అంటూ ప్రేక్షకులకు ఎస్.జే.సూర్య సూచించారు. అలాగే కార్తీ ఎంపిక చేసుకునే కథలు ఎప్పుడూ విభిన్నంగా ఉంటాయని ప్రశంసించారు. ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలో కార్తీ రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తూ అద్భుతంగా నటించారని చెప్పారు. ఆశికా రంగనాథ్, మాళవిక మోహనన్ కూడా తమ పాత్రల్లో మెప్పించారని తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ నాగార్జున, కార్తీ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. కార్తీ సైకిల్‌పై షూటింగ్ చేస్తున్న సమయంలో ఇబ్బంది కలగకుండా నాగార్జున ప్రత్యేకంగా స్పీడ్ బ్రేకర్‌ను తొలగించారని చెప్పిన సంఘటనను పంచుకున్నారు. చివరగా సెప్టెంబర్ 10న ‘సర్దార్ 2’ను థియేటర్లలో తప్పకుండా చూడాలని ప్రేక్షకులను కోరారు.
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?