మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న కన్నప్ప దాదాపుగా పూర్తయింది..సినిమాని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పటినుంచి గట్టిగా ప్రమోషన్స్ చేస్తోంది సినిమా టీం. కాదేది ప్రమోషన్ కి అనర్హం అన్నట్టు జ్యోతిర్లింగాల యాత్ర, చార్ధామ్ యాత్ర సహా మహా కుంభమేళాకి కూడా వెళ్లి ప్రమోషన్ చేసి వచ్చింది సినిమా టీం. అయితే ఎంత ప్రమోట్ చేస్తున్నా సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడడం గగనం అయిపోయింది. ఈ మధ్యకాలంలో మీడియా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు కానీ అవేవీ సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేసేలా కనిపించడం లేదు.
Jr NTR: ఆ క్రేజ్ ఏంటి సార్.. పిచ్చోళ్ళు అయిపోతున్నారు అక్కడ!
నిజానికి ‘మా’ ఎలక్షన్స్ తర్వాత మంచు ఫ్యామిలీ అంటేనే ఒక ట్రోలింగ్ ఫ్యామిలీ గా మారిపోయింది. ఇప్పుడు ఈమధ్య జరుగుతున్న ప్రమోషన్స్ లో కన్నప్ప సినిమాని ట్రోల్ చేస్తే శివుడిని ట్రోల్ చేసినట్లే ఆయన ఆగ్రహానికి గురవుతారు అంటూ రఘుబాబు లాంటి సీనియర్ నటుడు కామెంట్ చేస్తున్నాడంటే సినిమా కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉందో అర్థం అయిపోతుంది. సినిమా కంటెంట్ మీద నమ్మకం లేకనే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనే ప్రచారం సోషల్ మీడియా వర్గాల్లో జరుగుతోంది. ఎంత బజ్ తీసుకురావాలని పి.ఆర్ టీమ్స్ కష్టపడుతున్నా ఎందుకో సినిమా మీద మాత్రం బజ్ ఏర్పడటం లేదు. మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది.