Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- జర్మనీలో AfD పార్టీకి చారిత్రాత్మక విజయం.
- రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఫార్-రైట్ పార్టీ విక్టరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Germany AfD Election: జర్మనీలో రాజకీయ సంచలనం నమోదైంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, అంటే నాజీ శకం ముగిసిన తర్వాత, జర్మనీలోని సాక్సనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో తీవ్ర కుడిపక్ష(ఫార్ రైట్) ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (AfD) భారీ విజయాన్ని సాధించింది. సెప్టెంబర్ 6, 2026న జరిగిన లాండ్టాగ్ ఎన్నికలలో, AfD 43.8 శాతం ఓట్లతో చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. ఇది వారి 2021 ఫలితం (20.8%) కంటే రెట్టింపు కంటే ఎక్కువ. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ పార్టీ అయిన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (CDU) కేవలం 17.2 శాతం ఓట్లను మాత్రమే పొందింది.
83 మంది సభ్యులున్న సాక్సోనీ-అన్హాల్ట్ అసెంబ్లీలో AfDకి 39 సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఒంటరిగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన 42 సీట్లకు మూడు సీట్లు తక్కువగా నిలిచింది. జర్మనీ ఇంటెలిజెన్స్ సంస్థ ఏఎఫ్‌డీని ఒక అతివాద గ్రూపుగా పేర్కొంది. ఏఎఫ్‌డీ పార్టీ నేత 35 ఏళ్ల ఉల్రిచ్ జిగ్మండ్ ఈ ఫలితాలను చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు మాకు అవకాశాన్ని ఇచ్చారని అన్నారు. అయితే, మిగతా పార్టీలతో పొత్తులు ఉంటేనే ఏఎఫ్‌డీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
తూర్పు జర్మనీలో ఆర్థికంగా వెనకడిన ప్రాంతాల్లో వలసలు, ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై ఉన్న వ్యతిరేకత ఏఎఫ్‌డీకి కలిసి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఏఎఫ్‌డీతో ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి ముందుకురావడం లేదు. ఈ విధానాన్నే జర్మన్ రాజకీయాల్లో ‘ఫైర్‌వాల్’గా పిలుస్తారు. అయితే ఈ గెలుపుతో జర్మనీ రాజకీయ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ ఫలితాలు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ నాయకత్వానికి కూడా పెద్ద సవాలుగా మారింది. రాబోయే మెక్లెన్బర్గ్-వెస్ట్ పోమెరేనియా, బెర్లిన్ ఎన్నికల్లో AfD ప్రదర్శనపై ఈ ఫలిత ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు జర్మన్ రాజకీయాల్లో కీలకంగా మారింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!