తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలవరం కాలువ మట్టి అక్రమ తవ్వకాలు గుట్టు రట్టు అయ్యింది. పోలవరం కాలువలకు తూట్లు పొడిచి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. రాజానగరం మండలం కలవచర్ల గ్రామం వద్ద అక్రమ మట్టి త్రవ్వకాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు, స్థానికులు అడ్డుకున్నారు.