ప్రవీణ్ పగడాల కేసులో సంచలన వ్యాఖ్యలు చేవారు. మాజీ ఎంపీ హర్ష కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును నేను నమ్మడం లేదన్నారు.. రోడ్డు ప్రమాదం కాదు కచ్చితంగా హత్యే నంటూ హాట్ కామెంట్లు చేశారు.. ఆర్ఎస్ఎస్, హిందూ మతోన్మాదులు పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారని నా అనుమానం అన్నారు.
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్.. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానస్పద మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు.. హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు వచ్చేలోపు ప్రవీణ్ ఆరుగురితో మాట్లాడినట్టు గుర్తించాం..