క్యాన్సర్ కేసులు విషయంలో అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో మరోసారి వైద్య ఆరోగ్యశాఖ సమగ్ర సర్వే జరుపుతున్నారు. ఐదు బృందాలు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టాయి. బలభద్రపురం గ్రామంలోని పదివేల మందికి పైగా జనాభా ఉన్నారు.. ఇంటింటికి తిరిగి బృందం ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యను అడిగి తెలుసుకొంటున్నారు.