క్యాన్సర్ కేసులు విషయంలో అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో మరోసారి వైద్య ఆరోగ్యశాఖ సమగ్ర సర్వే జరుపుతున్నారు. ఐదు బృందాలు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టాయి. బలభద్రపురం గ్రామంలోని పదివేల మందికి పైగా జనాభా ఉన్నారు.. ఇంటింటికి తిరిగి బృందం ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యను అడిగి తెలుసుకొంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రేపటి నుండి క్యాన్సర్ కేసుల అంశంపై మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. క్యాన్సర్ కేసులు విషయంలో అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో గ్రామంలో మరోసారి సమగ్ర సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి రొమ్ము, గర్భాశయ, ముఖద్వారం, ఓరల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో జిల్లా వైద్యాధికారులు చర్చించి…
దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. క్యాన్సర్ రోగులకు ధర.. చికిత్స అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. శుక్రవారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన.. ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య 2.5 శాతం చొప్పున పెరుగుతోందన్నారు. పురుషులలో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ఎక్కువ మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని.. ఏటా 15.5 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు…
Cancer Cases: దేశంలో రానున్న కాలంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్ అంచనా వేస్తోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అందించిన డేటా ఆధారంగా ఎయిమ్స్ ఈ అంచనాను రూపొందించింది. 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్‌విఎస్ డియో అన్నారు.