విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రచ్చగా మారుతోంది.. ఈ ఘటనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రులపై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం రాజన్నదొర… పవన్‌పై విరుచుకుపడడ్డారు.. నేను వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ అభిమానిని.. కానీ, విశాఖ ఘటనతో అయన మీద ఉన్న అభిమానాన్ని పోగొట్టుకున్నాడని వ్యాఖ్యానించారు. పవన్ తన కార్యకర్తలని క్రమశిక్షణలో పెట్టుకోలేపోతున్నారన్న ఆయన.. జన సైనికులలో క్రమశిక్షణ లేక పోవడం వల్లే అధికారంలోకి రాలేకపోయామని గతంలో పవన్ కల్యాణ్ చెప్పారని గుర్తుచేశారు.. పవన్ కల్యాణ్ తన కోసం రాజకీయాలు చెయ్యడం లేదు చంద్రబాబు కోసమే చేస్తున్నాడని ఆరోపించారు.
Read Also: Threat Call to SBI: లోన్ ఇవ్వకుంటే బ్యాంక్‌ను పేల్చేస్తా.. చైర్మన్‌ను లేపేస్తా..!
ఇక, ఉత్తరాంధ్రలో రాజధానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన మంత్రుల మీద రాళ్ల దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం రాజన్న దొర.. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తన కార్యకర్తలని అదుపులో పెట్టుకోవాలని సూచించిన ఆయన… ఇది ఇంతటితో ముగిసిపోయేది కాదు.. దాడి చేసిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.. శాంతిభద్రతలను భంగం కలిగించినవారు ఎంతవారైన వదిలేదే లేదని స్పష్టం చేసిన ఆయన.. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి వివరిస్తాం మిగతా విషయాలు ఆయనే చూసుకుంటారు.. ఆయనే తగు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు డిప్యూటీ సీఎం రాజన్నదొర. కాగా, మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జనకు జేఏసీ ఇచ్చిన పిలుపునకు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు తెలిపింది.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పాల్గొని.. సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని.. విపక్షాలు కలసి రావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.