తాము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదని అన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీ అయినా.. మున్సిపల్ కార్మికుడు అయినా ఉపాధ్యాయుడు అయినా అందరూ ఒక్కటేనని తెలిపారు. ఐదో తేదీ నుండి గర్భిణీలకు, బాలింతలకు వైయస్సార్ కిట్లును ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. అంగన్వాడీలు 11 సమస్యలు తమ ముందు ఉంచారని.. అందులో 10 సమస్యలకు ఒప్పుకున్నామని తెలిపారు. మిగతా ఒకటి జీతాన్ని పెంపుదల చేయాలని అన్నారు. ఎన్నికల ముందు పెంపుదల చేయడం భావ్యం…
కడప విమానానికి ఫుల్ ఆక్యుపెన్సీ ఉందంటే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. విశాఖలో భూముల దోపిడీ కోసం వాళ్ళంతా ఇక్కడకు వస్తున్నట్టు కనిపిస్తోంది అని ఆమె విమర్శలు గుప్పించారు. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వంపై అబండాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఎప్పుడు సమర్పించారో ప్రజలకు చెప్పాలి అని పురంధేశ్వరి ప్రశ్నించారు.
గృహనిర్మాణశాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలందించారు. గడిచిన 45 రోజుల్లో హౌసింగ్ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేశామని అధికారులు తెలిపారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దెబ్బ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టజీవులైన కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలి అని జనసేనా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.