మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసీ డెవలప్మెంట్ పైన పార్లమెంట్‌లో ఒక ప్రశ్న లేవనెత్తాము.. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నామని రాష్ట్రం చెప్పిందని కేంద్రమంత్రి చెప్పారు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిందని హరీష్ రావు ఆరోపించారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీల తీరుపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తాజాగా ఎన్నికల హామీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కౌంటర్ ఎటాక్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూ వివాదంలో చంద్రబాబు తప్పు దొరికిపోయింది కనుకే రాజకీయాలు మొదలు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో కుల రాజకీయాలకు అద్యుడైన చంద్రబాబు.. ఇప్పుడు మత రాజకీయాలకు పునాదులు వేసి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Balochistan : బలూచిస్తాన్ పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్. ఇక్కడి యువత వీధిన పడ్డారు. ఆయన హక్కులను తుంగలో తొక్కేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. బలూచిస్థాన్‌లోని సాహిత్య సంస్థ బడ్జెట్‌లో పాకిస్థాన్ భారీగా కోత విధించింది.
హెరిటేజ్ మీది కాదు.. మోహన్ బాబుది అని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అన్నారు. జైలులో ఉండి కూడా మా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారని భువనేశ్వరి అంటున్నారు.. ఆరు నెలల్లో మోహన్ బాబు హెరిటేజ్ చంద్రబాబుకు వచ్చేసింది.. నార్కో టెస్ట్ పెడుతా మీకు నేను ప్రశ్నలు అడుగుతా అని ఆయన పేర్కొన్నారు.
కడప విమానానికి ఫుల్ ఆక్యుపెన్సీ ఉందంటే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. విశాఖలో భూముల దోపిడీ కోసం వాళ్ళంతా ఇక్కడకు వస్తున్నట్టు కనిపిస్తోంది అని ఆమె విమర్శలు గుప్పించారు. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వంపై అబండాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఎప్పుడు సమర్పించారో ప్రజలకు చెప్పాలి అని పురంధేశ్వరి ప్రశ్నించారు.
మంథని చౌరస్తాలో నడి రోడ్డుపై నిల్చుంటా బీఆర్ఎస్ నేతలను వచ్చి నన్ను చంపమను అంటూ పోలీసులపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి మహాముత్తారంలో ఓడేడు సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
తెలంగాణ మాదకద్రవ్యాలకు నిలయంగా మారిందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్. ప్రభాకర్. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేశామని చెప్పి.. విచారణ విషయంలో బ్లాక్ మెయిల్ గా వ్యవహరించింది తప్పితే దోషులను శిక్షించాలనే చిత్త శుద్ధి లేదన్నారు. సీఎస్ గా సోమేశ్ కుమార్ ఒక్క క్షణం కూడా బాధ్యతల్లో కొనసాగే హక్కు లేదు. ఐదేళ్ల కాలంలో మద్యం ఆదాయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. https://ntvtelugu.com/etela-rajender-hopes-bjp-rule-in-telangana/ ప్రతి బార్ కు,పబ్బుకు అనుసంధానంగా డ్రగ్స్ సప్లైర్స్…
ముందు ప్రకటించినట్టుగానే అలిపిరిలో టీడీపీ నేత నారా లోకేష్ ప్రమాణం చేశారు. వివేకా హత్యలో తనకు గానీ, తమ కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి పాత్ర లేదని లోకేష్ వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్‌రెడ్డి బయటికి రాలేదని అన్నారు. చెల్లికి న్యాయం చేయలేని వాడు మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? అని లోకేష్ ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యలో జగన్‌రెడ్డి పాత్ర ఉంది.. అందుకే రాలేదని అన్నారు. తమకు చిత్తశుద్ధి ఉంది…