దేశంలో ప్రజల ఇబ్బందులకు ప్రధాని మోడీనే బాధ్యత వహించాలని సిపిఐ రామకృష్ణ అన్నారు. కరోనా కంట్రోల్ చేసింది మోడీ వల్లే నంటూ గతంలో బిజెపి తీర్మానం చేసిందని..సెకండ్ వేవ్ లో వైఫల్యానికి మాత్రం మోడీ కారణం కాదంటారా ? అని ఫైర్ అయ్యారు. ఎన్నికలు నిర్వహణ, కుంభమేళా పెట్టడం వల్లేనని..దేశంలోనే యాభై శాతం కరోనా కేసులు నమోదయ్యాయని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలలో విజయమే ముఖ్యంగా మోడీ పని చేశారని..పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది సార్లు పోలింగ్ ఎందుకు పెట్టారని నిలదీశారు. ప్రక్షాళన చేశామని మోడీ చెప్పుకున్న గంగానదిలో శవాలు కొట్టుకు వస్తున్నాయని.. ప్రధానిగా మోడీని దింపి గడ్కరీ, రాజనాధ్ సింగ్ లను పెట్టాలనే చర్చ బిజెపిలో జరుగుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్, జగన్, చంద్రబాబులు మోడీకి భయపడుతున్నారని..రాజకీయం అంటే వాస్తవ పరిస్థితిపై ధైర్యంగా మాట్లాడాలని పేర్కొన్నారు. ఏపీకి విభజన హామీలు అమలు చేయలేదు, ప్రత్యేక హోదాపై మోడీ మాట తప్పారని ఫైర్ అయ్యారు.