తిరుమల శ్రీవారిని నిన్న 18839 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక మొత్తం 8840 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా… హుండి ఆదాయం 88 లక్షలుగా ఉంది. అయితే కరోనా కారణంగా శ్రీవారి హుండి ఆదాయం తగిపోతుంది. ఇక ఇవాళ నుంచి ఐదు రోజుల పాటు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంది టీటీడీ. ఆకాశగంగ వద్ద బాలాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, అలంకరణలు చేసేలా ఏర్పాట్లు చేసింది. అలిపిరి నడకమార్గం జూలై 31వరకు మూసివేత, ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్టు నడకమార్గాని వినియోగించు కోవాలని సూచించింది టీటీడీ.