Common Entrance Tests: అన్ని పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది.. టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగియగానే కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి.. ఇవాళ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. మే 5వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీన EAPCET నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మే 15 నుంచి 18వ తేదీ వరకు ఎంపీపీ అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. మే 22, 23 తేదీల్లో బైపీసీ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది.. ఈ నెల 17వ తేదీన ఐసెట్ నోటిఫికేషన్, మే 24, 25 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 10 తేదీ వరకు ఈసెట్ పరీక్షల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు EAPCETకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు ఐసెట్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ జరగనుంది.
Read Also: Silpa Chakrapani Reddy: మళ్లీ టీడీపీలోకి శిల్పా చక్రపాణిరెడ్డి..? క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..