ఈరోజు క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ, తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్ పై సమీక్ష చేపట్టనున్నారు సీఎం జగన్. ఇందులో ఆనందయ్య మందు పై జరుగుతున్న క్షేత్ర స్థాయి పరిశీలన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మూడు, నాలుగు రోజుల్లో నివేదిక వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు సీఎం. ఇక ఈ సమీక్షకు వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. అయితే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా… 100 పైగా మంది ఈ వైరస్ బారిన పడి మరణిస్తున్నారు.