CM Jagan Promise To Contract Employees Has Been Fulfilled Says Venkatarami Reddy: కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ హామీ నెరవేర్చారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. 10 ఏళ్లు సర్వీసు ఉండి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగానే.. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను సీఎం క్రమబద్దీకరించారని తెలిపారు. 2014లోనే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరిస్తామని టీడీపీ హామీ ఇచ్చి విస్మరించిందని విమర్శించారు. అర్హత, సర్వీసును ఆధారంగా.. విలైనంత ఎక్కువమంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని.. చెప్పిన మాట ప్రకారం అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను సీఎం క్రమబద్దీకరించారని పేర్కొన్నారు.
Avinash Reddy: సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వాయిదా
మిగిలిపోయిన కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను కూడా క్రమబద్దీకరిస్తామని సీఎం జగన్ చెప్పారని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ.. పత్రికల్లో ఎవరు తప్పుగా రాసినా సహించేది లేదని హెచ్చరించారు. మున్ముందు మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను కూడా సీఎం క్రమబద్దీకరిస్తారని నమ్మకం వెలిబుచ్చారు. బదిలీల్లో కొన్ని విభాగాల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని.. ఏఎన్ఎంలు, హార్టికల్చర్ సిబ్బంది ఇబ్బంది పడుతోందని అన్నారు. ఇబ్బందులు పడకుండా అందరికీ బదిలీ జరిగేలా.. ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Bhagwat Kishanrao Karad: యువ భారతదేశం అభివృద్ధి చెందాలన్నదే మోడీ ఆశయం