Bhagwat Kishanrao Karad Comments In Vijayawada Rojgar Mela: మన భారతదేశంలో అత్యధిక యువకులు ఉన్నారని, ప్రపంచంలో అత్యంత యువదేశం భారతదేశమని కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావ్ కారద్ పేర్కొన్నారు. ఈ యువ భారతదేశం అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని మోడీ ఆశయమని తెలిపారు. విజయవాడలో యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో కేంద్రం నిర్వహిస్తున్న రోజ్‌గార్ మేళాకు భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. 117 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మొదటి రోజ్‌గార్‌ను ఆగస్టులో చేశారన్నారు. ఇప్పటిదాకా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. భారత ఎకానమీ 2014 నాటికి 10వ స్ధానంలో ఉండేదని.. ఇప్పుడు 5వ స్థానానికి ఎదిగిందని పేర్కొన్నారు. ఎన్పీఏలు బ్యాంకుల్లో తగ్గాయని, బ్యాంకులు లాభాల్లో నడుస్తున్నాయని అన్నారు.
KTR Tweet: ఆకాశంలో సగం కాదు.. “ఆమే” ఆకాశం.. కేటీఆర్ ట్విట్ వైరల్
మన దేశ బడ్జెట్ 45 లక్షల కోట్లకంటే ఎక్కువగా పెరిగిందని భగవత్ తెలిపారు. ఆర్ధిక వ్యవస్ధలో డిజిటలైజేషన్ అత్యధికంగా జరుగుతోందన్నారు. 17 దేశాలలో ఎగుమతులు.. డాలర్ల బదులు రూపాయలలో చేస్తున్నామన్నారు. మన దేశ బీజేపీ 22 శాతానికి పెరిగిందన్నారు. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్, వసుధైవ కుటుంబకం.. ఇదీ G20 కోసం తీసుకున్న మాట అని స్పష్టం చేశారు. మోదీ పాలనలో లక్షల కొద్దీ ఉద్యోగాలిస్తున్నామన్నా ఆయన.. ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులు భవిష్యత్తులో ఇంకా బాగుండాలని కోరారు. రూ.2 వేల నోటు రద్దు తర్వాత డిజిటల్‌గా మరింత ముందుకెళతామని భగవత్ పేర్కొన్నారు. డిజిటల్ కరెన్సీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని.. 2 వేల నోట్లు ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తున్నాయో అంచనా వేయలేదని అన్నారు. కాగితాల రూపంలో కరెన్సీ ఉండదని చెప్పలేనన్నారు. పొలిటికల్ కారణాలతో లేదా ఎన్నికల నేపథ్యంలో రూ.2వేల నోటు రద్దు చేయలేదని స్పష్టం చేశారు.
GVL Narasimha Rao: జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ చర్చకు సిద్ధమా అంటూ సవాల్
ఇదే సమయంలో యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఒక సంవత్సరంలో రోజ్‌గార్ మేళా ద్వారా 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం అద్భుతమని కొనియాడారు. 43 ప్రాంతాల్లో 6వ రోజ్‌గార్ మేళా నిర్వహించామని.. విశాఖ, విజయవాడలలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో 6వ రోజ్‌గార్ మేళా నిర్వహించడం జరిగిందని చెప్పారు. 117 మందిలో 36 మందికి నియామకపత్రాలు యూనియన్ బ్యాంకు నుంచి ఇస్తున్నామన్నారు.