విజయనగరం జిల్లా చౌడవాడలో యువతిపై పెట్రోలుతో దాడి చేసిన ఘటన పై ముఖ్యమంత్రి వైస్ జగన్ ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం జగన్… ఆ యువతిని మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించాలని ఆదేశించారు.ప్రస్తుతం బాధితురాలు ఆరోగ్యం నిలకడగా ఉందని సీఎంకు తెలిపారు అధికారులు. రాములమ్మ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడాలని, అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని మంత్రి బొత్స సత్యన్నారాయణకు ఆదేశించారు సీఎం. అలాగే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక సీఎం ఆదేశాలతో బాధితురాలిని డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి, మంత్రి బొత్స, అధికారులు పరామర్శించారు.