CM Chandrababu: పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడరేవులు, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధిపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా రంగాల ఆధారిత ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు.
AP CM Review Meeting: పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై రివ్యూ చేశారు. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామిక వేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు సీఎంకు తెలిపారు.