‘నాకు వయస్సు ఓ నంబర్ మాత్రమే.. నా ఆలోచనలు 15 ఏళ్ల యువకుడిలా ఉంటుంది’ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారంలో రామకుప్పంలో జరిగిన టీడీపీ బహిరంగ సభ్యలో చంద్రబాబు మాట్లాడారు. ఈ మేరకు ‘నాకు వయసు నంబర్ మాత్రమే.. కానీ నా ఆలోచనలు వచ్చే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉంటాయి. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యం తప్పనిసరిగా సాధిస్తాం. హంద్రీ నీవాలో నీళ్ళు పారించమంటే, అవినీతి పారిస్తున్నారు. బటన్లు నొక్కి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. అందరూ రోడ్డున పడ్డారు. సీఎం మాత్రం పాలెస్‌లో ఉన్నాడు.
Also Read: Israeli Army Fires: గాజా నుంచి తిరిగి వస్తున్న సహాయ కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు
వాటాలు అడుగుతున్న కారణంగా పెట్టుబడులు రావడం లేదు. ఓడిపోతున్నట్లు జగన్‌కి అర్ధం అయ్యుంది. తిరుగుబాటు మొదలైంది. మీ దాడులకు భయపడను. మీరు తిన్నది కక్కిస్తాను. సామాజిక న్యాయం ఎక్కడ చేశావు. వైసీపీలో సామాజిక న్యాయం.. నేతి బీర నెయ్యి చందం అన్న చందంగా ఉంది. రెడ్లు ఎవ్వరూ బాగుపడలేదు. నలుగురు రెడ్లు పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డిలు బాగుపడ్డారు. మారాల్సింది సీఎం మాత్రమే.. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ వస్తే రాష్ట్రంలో 175 స్థానాలు మనవే. గాడి తప్పిన పాలన మళ్లీ సరి చేయాలి. ఇదే నా కోరిక’ అని వ్యాఖ్యానించారు.
Also Read: Pawan Kalyan: కాకినాడపై స్పెషల్ ఫోకస్.. పవన్ కల్యాణ్ పర్యటన పొడిగింపు