టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం పర్యటన ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.. బుధవారం నుంచి పలు చోట్ల టీడీపీ-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు, దాడులకు దారి తీసింది.. ఇక, ఇవాళ అన్నా క్యాంటీన్ ధ్వంసం, బంద్‌కు వైసీపీ పిలుపుతో మరింత టెన్షన్ నెలకొంది.. ఇక, కుప్పంలో టీడీపీ నేతలపై భారీగా కేసులు నమోదు చేశారు పోలీసులు.. రామకుప్పం మండలంలో టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.. మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు సహా ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసు పెట్టారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసులతో పాటు.. 143, 147, 148, 149, 424 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు… మరో 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. మొత్తంగా కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతలకు కారణం అవ్వడంతో పాటు.. టీడీపీ నేతలపైనే కేసులు పెట్టడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే, ఉద్దేశ్యపూర్వకంగానే రివర్స్‌లో తమపైనే పోలీసులు కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.. మరోవైపు.. చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో చోటు చేసుకున్న పరిస్థితులు.. పోలీసులు వైఫల్యం చెందారంటూ.. డీజీపీకి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాసిన విషయం తెలిసిందే.
Read Also: Varla Ramaiah: కుప్పం ఘటనపై డీజీపీకి టీడీపీ లేఖ..