OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఉమ్మడి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారా? మనకందుకులే అని ముడుచుకోలేక, అలాగని యాక్టివ్ రోల్ తీసుకోలేక సతమతం అవుతున్నారా? ప్రోగ్రామ్ పేరుతో టీడీపీ ఇన్ఛార్జ్లు యాక్టివేట్ అయిపోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా గందరగోళం? ఇంటింటికి టిడిపి పేరుతో జులైలో కార్యక్రమం ప్రారంభించింది అధికార పార్టీ. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి , సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అంత వరకు బాగానే ఉన్నా… ఆ తర్వాత కాస్త డిఫరెంట్‌గా చర్చలు జరిగాయి. మరీ ముఖ్యంగా జనసేన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక రకమైన గందరగోళం కూడా ఏర్పడిందట. ఇక్కడ మూడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్కదాంట్లో ఇద్దరేసి చొప్పున ఉమ్మడి జిల్లాలో మొత్తం ఆరుగురు జనసేన శాసనసభ్యులు ఉన్నారు. దాంతో…రెండేళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడే సందర్భంలో మా పాత్ర ఏంటన్న చర్చ గ్లాస్ వర్గాల్లో జరిగింది. ఆ రకంగా క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా… ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ఇంటింటికీ కూటమిగా పేరు మార్చారు. మిత్రపక్షం క్యాడర్, లీడర్లు సైడ్ అయిపోతున్నారని ఆ విధంగా సర్దుబాటు చేసినప్పటికీ… వాళ్ళు మాత్రం ఓన్ చేసుకోలేకపోతున్నారట. తమకు ఆ కార్యక్రమంతో సంబంధం లేదని గ్లాస్ ఎమ్మెల్యేలు అంటున్నట్టు సమాచారం. అలా ఎందుకని అంటే… మాకు మా పార్టీ నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని కుండ బద్దలు కొట్టేస్తున్నట్టు తెలిసింది. రాజోలు, పి.గన్నవరం, కాకినాడ రూరల్, పిఠాపురం, రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం జనసేన ప్రాతినిధ్యం ఉంది. అక్కడంతా టీడీపీ కోఆర్డినేటర్లు యాక్టివ్‌గా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పిఠాపురంలో మాత్రం ప్రస్తుతానికి ప్రోగ్రాం హోల్డ్ లో ఉంది..మిగతా ఐదు చోట్ల సైకిల్ పార్టీ కో ఆర్డినేటర్లు బీభత్సంగా అడ్వాన్స్ అయిపోతున్నారట.
తమను తాము ఎమ్మెల్యేలుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఆ మొత్తం ఎపిసోడ్లో వాళ్లే ఉంటున్నారు కాబట్టి పర్ఫామెన్స్ కూడా మామూలుగా ఉండడం లేదని చెప్పుకుంటున్నారు. జనం దగ్గరకు వెళ్ళి ప్రభుత్వం నుంచి ఏం లబ్ధి పొందారు? పాలన ఎలా ఉంది అంటూ ప్రశ్నలు వర్షం కురిపించేస్తున్నారు. అదే ఊపుతో… ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండని టీడీపీ ఇన్ఛార్జ్లు అనడం జనసేన ఎమ్మెల్యేలకు మింగుడు పడ్డం లేదట. పి. గన్నవరం నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడం గురించి రచ్చ జరిగింది. జనసేన ఎమ్మెల్యే ఉన్నచోట ఇదేనా ప్రోటోకాల్ అని గ్లాస్ కేడర్ ప్రశ్నించడంతో మళ్లీ మార్చేశారు. తర్వాత కూడా…ఇంటింటికి కూటమి అని అంటున్నా… జనసైనికులు మాత్రం అటువైపు వెళ్లడం లేదట. అసలు కూటమి మొత్తం ఇన్వాల్వ్ కావాలంటే ముందు పార్టీ పెద్దల మధ్య దానికి సంబంధించిన చర్చ జరగాలి కదా అంటూ లాజిక్ లాగుతున్నట్టు తెలిసింది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని గుర్తు చేస్తున్నారట జనసేన కార్యకర్తలు. కానీ… ఇదే జిల్లాలో మరికొన్ని ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన కో ఆర్డినేటర్లు, లోకల్ లీడర్లు తప్పని పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. అలా ఎందుకని అంటే…. ఎమ్మెల్యేని కాదని మనం సోలోగా ఉంటే పనులు కావుకదా బ్రదర్ అంటూ చమత్కారిస్తున్నారట.
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అంతా కలిసి పనిచేయాలని జనసేన పెద్దలు చెప్పారు. మేం ఆ పనే చేస్తున్నామంటూ ముక్తాయింపునిస్తున్నారు. ఇక జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో మాత్రం మిత్రపక్షం కోఆర్డినేటర్లు అడ్వాన్స్ అయిపోవడంతో తమ ప్రయారిటీ తగ్గుతున్నట్టు ఫీలవుతున్నారట. టీడీపీ…. కూటమిలో మెయిన్ పార్టీ కాబట్టి అధికారులు కూడా అటువైపే మొగ్గుతున్నట్టు చెబుతున్నారు. పైకి ఎమ్మెల్యే అంటూ హడావిడి చేస్తున్నా లోలోపల మాత్రం ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నారు. ఇంటింటికి కార్యక్రమంలో వస్తున్న అర్జీలు అధికారుల దృష్టికి వెళ్తుండటంతో వాళ్లు వాటికి రెస్పాండ్ అవ్వక తప్పని పరిస్థితి ఉందంటున్నారు. మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ అసలు ఇంటింటికి టీడీపీనా? లేక ఇంటింటికీ కూటమినా అన్న సంగతి తేల్చుకోలేక గ్లాస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారన్నది లోకల్ టాక్. పార్టీ నుంచి అధికారికంగా ఎటువంటి ఆదేశాలు లేనప్పుడు మనకు సంబంధం ఏంటని లైట్ తీసుకున్నారట. అదే సమయంలో మిత్రపక్షం కోఆర్డినేటర్లు యాక్టివ్ రోల్ పోషించడం కూడా వాళ్ళకు మింగుడు పడ్డం లేదని అంటున్నారు.
- Tags
- ntv
- OTR
- TDP vs Janasena
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?