Tammineni Sitaram: అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అది రైతుల యాత్ర కాదని.. బినామీ యాత్ర అని వర్ణించారు. పాదయాత్ర చేసేది రైతులు కాదని తాము తొలిరోజు నుంచి చెప్తున్నామని.. ముసుగువీరులు ఎవరో శాసనసభలోనే చెప్పామని తమ్మినేని సీతారాం గుర్తుచేశారు. 28వేల మంది వద్ద బలవంతంగా భూములు లాక్కొంటే పాదయాత్రకు ఎంత మంది వచ్చారో అందరూ చూశారన్నారు. ఐడెంటెటీ కార్డులు కేవలం 70…
Gudivada Amarnath: అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. వికేంద్రీకరణపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదని.. దండయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. వారిని తరిమికొట్టేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. తక్షణమే అమరావతి రైతులు తమ పాదయాత్రను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా తమ ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందన్నారు.…