శ్రమదానం పవన్ కొత్త వేషం.. ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ కోసమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్ల మరమ్మతుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం సెటైర్లు వేశారు ఏపీ మంత్రి శంకర్ నారాయణ.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.. పవన్‌ది ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ తీసుకునే పార్టీ అని ఎద్దేవా చేసిన ఆయన.. జాతీయ రహదారిపై మాట్లాడక పోవడం విడ్డూరం.. రాష్ట్ర రహదారులపై మాట్లాడడం ఏంటి? అని ప్రశ్నించారు. వర్షాలు ఆగిన వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపడతామన్న ఆయన.. ఉనికి కోసం బూటకపు రోడ్డు శ్రమ దానాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు.
ఇక, పవన్ కల్యాణ్ ది ప్యాకేజీ కోసమే ఆరాటం తప్ప… ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు మంత్రి శంకర్ నారాయణ.. పవన్ పార్టీ పెట్టింది తన స్వలాభం కోసం… తన విలాసవంతమైన జీవితం గడపడం కోసమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.. మరోవైపు, రోడ్ల శ్రమదానం పేరుతో కొత్త వేషం వేస్తున్నాడని మండిపడ్డ ఆయన.. ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని గ్రహించాలన్నారు. కాగా, ఇవాళ రాజమండ్రితో పాటు.. అనంతపురం జిల్లాలోనే పర్యటించనున్న పవన్ కల్యాణ్.. అక్కడ రోడ్ల మరమ్మతుల కోసం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొననున్న సంగతి తెలిసిందే.
Also Read
- AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
- Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
తాజావార్తలు
-
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
-
Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె..
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..