T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- వెస్టిండీస్‌తో మూడో టీ20లో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు
- అద్భుత బౌలింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
- లక్ష్యాన్ని కాపాడే క్రమంలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా అర్ష్‌దీప్
- టీ20 అంతర్జాతీయ క్రికెట్లో లక్ష్యాన్ని డిఫెండ్ చేస్తూ 84 వికెట్లు
- న్యూజిలాండ్ మాజీ పేసర్ టిమ్ సౌథీ రికార్డును అధిగమించిన అర్ష్‌దీప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh T20 World Record: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అదరగొట్టాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాత్ర పోషించడమే కాకుండా “ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్” ను కూడా అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో అర్ష్‌దీప్ టీ20 క్రికెట్లో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
టీ20 చరిత్రలో లక్ష్యాన్ని కాపాడే క్రమంలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ టిమ్ సౌథీని వెనక్కి నెట్టాడు. వెస్టిండీస్‌తో మూడో టీ20లో మూడు వికెట్లు తీసిన అర్ష్‌దీప్.. లక్ష్యాన్ని డిఫెండ్ చేస్తున్న సమయంలో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో తన వికెట్ల సంఖ్యను 84కు చేర్చాడు. ఈ వికెట్లను 57 ఇన్నింగ్స్‌ల్లో 20.79 సగటు, 8.84 ఎకానమీ, 14.1 స్ట్రైక్ రేట్‌తో సాధించాడు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ఇప్పటివరకు ఈ రికార్డు టిమ్ సౌథీ పేరిట ఉండేది. సౌథీ 82 వికెట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 72 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత
లక్ష్యాన్ని కాపాడుతూ అత్యధిక వికెట్లు తీసిన పేసర్లు..
* అర్ష్‌దీప్ సింగ్ – 84 వికెట్లు
* టిమ్ సౌథీ – 82 వికెట్లు
* జస్ప్రీత్ బుమ్రా – 72 వికెట్లు
* ముస్తాఫిజుర్ రెహ్మాన్ – 69 వికెట్లు
* అలీ దౌద్ – 68 వికెట్లు
ఇండోర్‌లో జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ అర్ధశతకంతో 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది. అనంతరం 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెస్టిండీస్ బ్యాటర్లలో షిమ్రాన్ హెట్మయర్ 26 బంతుల్లో 43 పరుగులు, కమిల్ పూరన్ 27 బంతుల్లో 42 పరుగులు చేశారు. చివర్లో షమార్ స్ప్రింగర్ కేవలం 11 బంతుల్లోనే అజేయంగా 35 పరుగులు చేసి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. అయినప్పటికీ వెస్టిండీస్ విజయాన్ని అందుకోలేకపోయింది.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 44 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టగా.. నమన్ ధీర్ రెండు వికెట్లు తీశాడు. అద్భుత బౌలింగ్‌తో భారత్‌కు విజయాన్ని అందించిన అర్ష్‌దీప్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మూడో టీ20లో 14 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వచ్చింది. టీమిండియా 223 పరుగుల స్కోరును విజయవంతంగా కాపాడుకోవడంలో భారత పేసర్లు కీలక పాత్ర పోషించారు.
Twin strikes of huge importance ✌️
How good was Arshdeep Singh in that over? 🤌
Updates ▶️ https://t.co/0ve4uDWSIn
#TeamIndia | #INDvWI | @mflone_ | @arshdeepsinghh https://t.co/LqAOOcQA3H
— BCCI (@BCCI) October 11, 2026
Stumps Rattled x 2⃣ ✌️
Arshdeep Singh 🤝 Naman Dhir strike TIMBER 🎯
Updates ▶️ https://t.co/0ve4uDWSIn
#TeamIndia | #INDvWI | @mflone_ https://t.co/qtM2RxaCyp
— BCCI (@BCCI) October 11, 2026
తాజావార్తలు
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..