AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రాథమిక కసరత్తు పూర్తయినట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వారీగా కేటాయించే స్థానాలపై దాదాపుగా నిర్ణయానికి రాగా.. తుది కసరత్తు కొనసాగుతోంది. నేడు మధ్యాహ్నం పూర్తి స్థాయి రిజర్వేషన్ల జాబితా విడుదల కానుంది.
కార్పొరేషన్లలో మేయర్ పదవుల రిజర్వేషన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశంపై అధికారులు కసరత్తు జరుగుతున్నారు. అలాగే రాజమండ్రి, కర్నూలు కార్పొరేషన్లలో మేయర్ పదవులను ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ను జనరల్ కేటగిరీలో చేర్చే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. తుది జాబితా విడుదలైన తర్వాతే ఏ కార్పొరేషన్లో ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఖరారైందన్న అంశంపై స్పష్టత రానుంది.
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
మున్సిపాలిటీల విషయానికి వస్తే.. బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఎన్నికల్లో మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. 50 శాతం చోట్ల మహిళలకు ఛైర్పర్సన్ పదవులు దక్కనున్నాయి. మేయర్ పదవుల్లో దాదాపు ఎనిమిది స్థానాలను మహిళలకు కేటాయించే అవకాశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 దక్కనున్నాయి. నేడు మధ్యాహ్నం విడుదలయ్యే పూర్తి స్థాయి జాబితాతో మేయర్, మున్సిపల్ పదవుల రిజర్వేషన్లపై స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!