T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah T20 GOAT: టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు ఎవరు?.. ఈ ప్రశ్నకు ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. టీ20 ఫార్మాట్లో దిగ్గజాలుగా గుర్తింపు పొందిన ఎనిమిది మంది ఆటగాళ్లతో నిర్వహించిన ‘This or That’ ఛాలెంజ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి నిరాశ ఎదురైంది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఊసేలేదు. చివరకు టీ20 క్రికెట్ ‘గోట్’గా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను రషీద్ ఖాన్ ఎంపిక చేశాడు. ఈ ఎంపికకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫో నిర్వహించిన ఈ ఛాలెంజ్‌లో మొత్తం ఎనిమిది మంది క్రికెటర్లు పోటీపడ్డారు. రషీద్ ఖాన్, సునీల్ నరైన్, ఏబీ డివిలియర్స్, ఆండ్రీ రస్సెల్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్ ఈ జాబితాలో ఉన్నారు. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, గ్రాండ్ ఫైనల్.. ఇలా మూడు దశల్లో పోటీ సాగింది. ప్రతి దశలో ఇద్దరు ఆటగాళ్లలో ఒకరిని రషీద్ ఖాన్ ఎంపిక చేస్తూ ముందుకు వెళ్ళాడు. చివరకు టీ20 క్రికెట్ ‘గోట్’గా జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు.
Also Read
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
మొదట సునీల్ నరైన్‌తో జరిగిన పోలికలో రషీద్ ఖాన్ తనకే ఓటు వేసుకున్నాడు. టీ20ల్లో రషీద్ 550 మ్యాచ్‌ల్లో 740 వికెట్లు పడగొట్టగా.. నరైన్ 617 మ్యాచ్‌ల్లో 658 వికెట్లు తీశాడు. అనంతరం వెస్టిండీస్ విధ్వంసక ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌తో దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్‌ను పోల్చగా.. డివిలియర్స్‌ను ఎంపిక చేశాడు. డివిలియర్స్ 340 టీ20 మ్యాచ్‌ల్లో 9,424 పరుగులు చేయగా.. రస్సెల్ 9,933 పరుగులు బాదాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ మధ్య జరిగిన పోలికలో రషీద్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కింగ్ కోహ్లీని ఎంపిక చేశాడు. టీ20ల్లో కోహ్లీ నిలకడైన ప్రదర్శన, పరుగులు సాధించే సామర్థ్యం అతడికి ఈ ఎంపికలో ముందంజలో ఉంచింది. అయితే కోహ్లీ ప్రయాణం సెమీఫైనల్స్‌లోనే ముగిసింది.
మరోవైపు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ మధ్య జరిగిన పోటీలో మనోడికే రషీద్ ఖాన్ ఓటు వేశాడు. దీంతో రషీద్ ఖాన్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించారు. సెమీఫైనల్లో ఏబీ డివిలియర్స్‌తో జరిగిన పోటీలో రషీద్ ఖాన్‌ను వెనక్కి నెట్టి మిస్టర్ 360 (డివిలియర్స్) ఫైనల్‌కు చేరాడు. మరో సెమీఫైనల్లో కోహ్లీ, బుమ్రా తలపడగా.. రషీద్ భారత పేసర్‌నే ఎంపిక చేశాడు. దీంతో కోహ్లీకి ఫైనల్ చేరే అవకాశం లేకుండా పోయింది. గ్రాండ్ ఫైనల్లో డివిలియర్స్, బుమ్రా పోటీపడ్డారు. ఈ ఇద్దరిలో బుమ్రాను టీ20 క్రికెట్ గోట్గా ఎంపిక చేశాడు. దీంతో ఈ ఛాలెంజ్‌లో భారత పేసర్ విజేతగా నిలిచాడు. సాధారణంగా టీ20 ఫార్మాట్లో బ్యాటర్ల విధ్వంసకర ఇన్నింగ్స్‌లు, భారీ పరుగులు ఎక్కువగా చర్చకు వస్తుంటాయి. అయితే ఈ ఎంపికలో బుమ్రా బౌలింగ్ నైపుణ్యం, ఒత్తిడిలో రాణించే సామర్థ్యానికి రషీద్ ప్రాధాన్యమిచ్చాడు.
రషీద్ ఖాన్ ఎంపిక చేసిన విజేతలు:
క్వార్టర్ ఫైనల్స్: రషీద్ ఖాన్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా
సెమీఫైనల్స్: ఏబీ డివిలియర్స్, జస్ప్రీత్ బుమ్రా
గ్రాండ్ ఫైనల్: జస్ప్రీత్ బుమ్రా.
తాజావార్తలు
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
ట్రెండింగ్
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు