అధికారులు బదిలీపై వెళ్తే.. లోకల్‌గా ఉన్న ఎమ్మెల్యే, కలెక్టర్, లేదా మంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మాత్రం పూర్తి డిఫరెంట్. ఇక్కడికి ఎవరొచ్చినా.. ఏం జరగాలన్నా ముందుగా ఎమ్మెల్యే సోదరులను కలవాలట. ఇక్కడ ఎమ్మెల్యే మొన్నటి వరకు మంత్రిగా చేసిన శంకర నారాయణ. తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచినా.. 2019లోనే కేబినెట్‌లో చోటు కొట్టేశారు. ఇందుకు సామాజికవర్గం సమీకరణాలు కలిసొచ్చాయి. శంకర నారాయణ ఎమ్మెల్యే కాకముందు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా. ఆ సమయంలో…
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి శంకర్ నారాయణ… అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని దున్న అని పేరు పెట్టి పిలవడం ఎంతవరకు సమంజసం అంటూ మండిపడ్డారు.. విద్యార్థి లోకాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నందుకు తెలుగుదేశం పార్టీకి సిగ్గు అనిపించడం లేదా? అంటూ ప్రశ్నించిన మంత్రి.. సాక్షాత్తు దెబ్బతిన్న విద్యార్థులే తమపై పోలీసులు లాఠీఛార్జి చేయలేదని…
రోడ్ల మరమ్మతుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం సెటైర్లు వేశారు ఏపీ మంత్రి శంకర్ నారాయణ.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.. పవన్‌ది ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ తీసుకునే పార్టీ అని ఎద్దేవా చేసిన ఆయన.. జాతీయ రహదారిపై మాట్లాడక పోవడం విడ్డూరం.. రాష్ట్ర రహదారులపై మాట్లాడడం ఏంటి? అని ప్రశ్నించారు. వర్షాలు ఆగిన వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపడతామన్న ఆయన.. ఉనికి కోసం…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రోడ్ల దుస్థితికి గత తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని ఆరోపించారు మంత్రి శంకర నారాయణ… సీఎం వైఎస్ జగన్.. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని.. వర్షాకాలం పూర్తి అయిన తర్వాత రోడ్ల మరమ్మతులు చేపడతామని ప్రకటించారు.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ రోడ్లను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించిన శంకర నారాయణ.. అక్టోబర్ తర్వాత రోడ్ల పనులు ప్రారంభిస్తామని…