శంకర్ నారాయణ. సీఎం జగన్ కేబినెట్ వన్‌లో అనుకోకుండా చోటు సంపాదించిన మంత్రుల్లో ఒకరు. అనంతపురం జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కురుబ సామాజికవర్గం కావడంతో ఎలాంటి ప్రయత్నం చేయకుండానే 2019లో మినిస్టర్ అయ్యారు. మంత్రిగా ఉన్నన్ని రోజులు బాగానే నడిచింది. పెనుకొండ నియోజకవర్గంలో చాపకింద నీరులా ఉన్న వర్గపోరు.. శంకరనారాయణ మంత్రి పదవి పోయాక కానీ బయట పడలేదు. ఎవరైతే ఆయన గెలుపునకు బ్యాక్ బోన్‌గా ఉన్నరో వారే ఇప్పుడు వ్యతిరేకంగా మారారట. శంకరనారాయణ మంత్రిగా…
సత్యసాయి జిల్లా అభివృద్ధి సలహా మండలి సమావేశంలో రచ్చ రచ్చ జరిగింది. నీటి కేటాయింపు విషయంలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య భేదాభిప్రాయాలు బహిర్గతం అయ్యాయి. గత ఏడాది ఏ విధంగా నీటి కేటాయింపులు జరిగాయో ఈ ఏడాది కూడా అదే విధంగా నీటి కేటాయింపులు జరగాలని పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. అయితే తన నియోజకవర్గానికి ఆయకట్టు ప్రాతిపదికన కేటాయింపు జరగాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోరారు.…
శంకర నారాయణ. మాజీ మంత్రి. పెనుకొండ ఎమ్మెల్యే. కేబినెట్‌లో చోటు కోల్పోయిన తర్వాత శ్రీసత్యసాయి జిల్లాకు వైసీపీ అధ్యక్షుడయ్యారు. ఆయనకు పార్టీ బాధ్యతలు కొత్త కాదు. గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సుదీర్ఘకాలంపాటు ఆయనే వైసీపీ చీఫ్. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి జిల్లాకు పార్టీ అధ్యక్షుడు. ఆ సమయంలో పార్టీలో ఎక్కడా.. ఎవరి మధ్యా విభేదాలు కనిపించలేదు. మాజీ మంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టాక అసలు సిసలైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు శంకర నారాయణ. వాటిపైనే…
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి శంకర్ నారాయణ… అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని దున్న అని పేరు పెట్టి పిలవడం ఎంతవరకు సమంజసం అంటూ మండిపడ్డారు.. విద్యార్థి లోకాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నందుకు తెలుగుదేశం పార్టీకి సిగ్గు అనిపించడం లేదా? అంటూ ప్రశ్నించిన మంత్రి.. సాక్షాత్తు దెబ్బతిన్న విద్యార్థులే తమపై పోలీసులు లాఠీఛార్జి చేయలేదని…
రోడ్ల మరమ్మతుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం సెటైర్లు వేశారు ఏపీ మంత్రి శంకర్ నారాయణ.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.. పవన్‌ది ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ తీసుకునే పార్టీ అని ఎద్దేవా చేసిన ఆయన.. జాతీయ రహదారిపై మాట్లాడక పోవడం విడ్డూరం.. రాష్ట్ర రహదారులపై మాట్లాడడం ఏంటి? అని ప్రశ్నించారు. వర్షాలు ఆగిన వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపడతామన్న ఆయన.. ఉనికి కోసం…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి శంకరనారాయణ. అనంతరం ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కి సినిమా కాల్షిట్లు లేకపోతే రాజకీయలు గుర్తుకు వస్తాయి అని కామెంట్ చేసారు. టీడీపీ, జనాసేన ఉనికి కోల్పోతున్న నేఫధ్యంలో రోడ్లు పై రాజకీయాలు చేస్తూన్నాయి అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణ నిధులు ప్రక్కదారి పట్టించడంతోనే… రోడ్లకు ఈ దుస్థితి వచ్చింది అని ఆరోపించారు. సోము వీర్రాజుకు అవగాహన లేక కేంద్ర నిధులు ప్రక్కదారి పట్టాయని విమర్శిస్తూన్నారు. వచ్చే ఏడాది…