Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- సోషల్ మీడియాలో నందన చేసిన పోస్ట్ వైరల్
- గత 28 రోజులు ఎన్నో విషయాలు నేర్పించాయని పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youtuber Nandu: నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందన తాజాగా చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘28 రోజుల తర్వాత కుటుంబంతో కలిసి ఇంటికి తిరిగి వచ్చాను’ అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. అయితే మరోవైపు లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు ఉండడంతో.. ఇప్పుడు ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఆమె చేసిన పోస్టులో.. అక్టోబర్ 4న కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చినట్లు రాసుకొచ్చింది. గత 28 రోజులు తనకు ఎన్నో విషయాలను నేర్పించాయని.. నిజాయితీ, సత్యం, అంతర్గత బలం జీవితంలో ఎప్పటికీ ముఖ్యమైనవని పేర్కొంటూ, ఈ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని, బాధను కూడా అనుభవించానని రాసుకొచ్చారు.
Also Read
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
అయితే తాను చేదు భావాలతో తిరిగి రాలేదని.. విలువైన పాఠాలు, ధైర్యం, ఆశతో తిరిగి వచ్చానని నందన పేర్కొన్నారు. తన అనుభవం ద్వారా నిజాయితీగా ఉండే వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని, సత్యానికి ఇప్పటికీ విలువ ఉందని తెలుసుకున్నానని తెలిపారు. మన విలువలు, నిజాయితీ కోసం నిలబడటం ఎప్పటికీ విలువైనదేనని పేర్కొన్నారు.
జీవితం కొన్నిసార్లు మనం ఊహించని విధంగా పరీక్షిస్తుందని నందన తన పోస్టులో పేర్కొన్నారు. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటి కారణంగా మన విలువలను కోల్పోకూడదని అన్నారు. 28 రోజుల అనుభవం తనకు జీవితాంతం గుర్తుండిపోయే పాఠాలను నేర్పిందని.. ఈ ప్రయాణం తనను మరింత బలమైన వ్యక్తిగా మార్చిందని తెలిపారు. అలాగే దసరా సందర్భంగా కూడా ఆమె ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా చివరికి సత్యం, మంచితనమే గెలుస్తాయని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!