ఏపీ సీఎం వైఎస్ జగన్ హస్తినకు వెళ్లారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇక, రాత్రికి అక్కడే బస చేసే.. రేపు తిరిగి ఏపీకి రానున్నారు.. ఇదే సమయంలో.. సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రతిపక్షాలకు అత్యుత్సాహం ఎక్కువ అవుతోందని మండిపడ్డ ఆయన.. సీఎం టూర్ పై వక్రభాష్యాలు చెప్పడం దురదృష్టకరం అన్నారు.. పదేళ్లుగా టీడీపీ ఇదే మైండ్ సెట్‌తో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల సమీక్ష, కోవిడ్ నేపథ్యంలో పరిస్థితులను వివరించడానికి ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్తుంటారు.. ఈ పర్యటనలు ఒక్కోరోజు వాయిదా కూడా పడుతుంటాయి.. కానీ, కేసుల గురుంచి మాట్లాడడం కోసమే వెళ్తున్నారంటూ.. సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఏదో అపోహలు సృష్టించడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఇది ఇప్పటిది కాదు, వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఢిల్లీ వెళ్లినా ఇదే అత్యుత్సాహం ఉండేది, ఎందుకో అర్థం కాదన్నారు.
ఇక, అద్దె ఆధారిత పన్ను విధానంలోపభూయిష్టంగా ఉండడం వల్లే విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్నే అమలు చేస్తున్నాయన్న ఆయన.. నూతన ఆస్తిపన్ను విధానం వల్ల వందల కోట్ల భారం అన్నట్లు ప్రచారం జరుగుతోంది, ఇది అవాస్తవం అన్నారు.. లోపాలు సరిదిద్ది, అందరికీ ఒకే పన్ను విధానం అమలు చేయడం అనేది ప్రధాన లక్ష్యం, దీనివల్ల కేవలం 186 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా ప్రభుత్వానికి దక్కనుందన్నారు.. ప్రస్తుతం వసూలు చేస్తున్న దానిపైన ఆస్తి పన్ను 15 శాతం మించ కుండా కొత్త పన్ను విధానం ఉండాలని సీఎం నిర్ధేశించారి తెలిపారు మంత్రి బొత్స.