రాజమండ్రిలోని గైట్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై వాస్తవాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానితో ఎపుడు కలిసినా పాడిందేపాటగా ఒకే అంశం ప్రత్యేక హోదా అంటారు. గతంలో అడిగినవే అడిగారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ఏమేమి అంశాలుపెట్టారో బయటకు రానివ్వరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారు.…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. వరుసగా కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, గజేంద్రసింగ్ షెకావత్‌లను కలిసిశారు.. ఆ తర్వాత నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్‌తో భేటీ అయ్యారు.. పలు అభివృద్ధి అంశాలపై చర్చ సాగింది.. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించిన సీఎం… రాష్ట్రవ్యాప్తంగా 30.76లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని, దీనికోసం 68,381 ఎకరాలను సేకరించినట్టు తెలిపారు.. ఇళ్ల పట్టాల…
ఏపీ సీఎం వైఎస్ జగన్ హస్తినకు వెళ్లారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇక, రాత్రికి అక్కడే బస చేసే.. రేపు తిరిగి ఏపీకి రానున్నారు.. ఇదే సమయంలో.. సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రతిపక్షాలకు అత్యుత్సాహం ఎక్కువ అవుతోందని మండిపడ్డ ఆయన.. సీఎం టూర్ పై వక్రభాష్యాలు చెప్పడం దురదృష్టకరం అన్నారు..…