అరుదైన వస్తువులు, పెయింటింగ్స్ వేలంలో కోట్ల రూపాయల ధరలు పలుకుతుంటాయి. ఇదే రీతిలో తాజాగా దశాబ్ధాల చరిత్ర కలిగిన పటేక్ ఫిలిప్ వాచ్ వేలంలో రికార్డ్ ధర పలికింది. 2016లో వేలం వేయబడిన పటెక్ ఫిలిప్ వాచ్ మరో రికార్డును సృష్టించింది. ఈ వాచ్ రూ. 156 కోట్లకు అమ్ముడైంది, ఇది కొత్త ప్రపంచ రికార్డు. 1943లో తయారు చేయబడిన ఈ వాచ్‌ను పోటెక్ ఫిలిప్ పెర్పెచువల్ క్యాలెండర్ రిఫరెన్స్ 1518 అని పిలుస్తారు. ఈ వారాంతంలో ఆ చేతి గడియారం మరింత ఎక్కువ ధరకు అమ్ముడయిందని వేలం సంస్థ ఫిలిప్స్ తెలిపింది.
Also Read:Toyota Hilux 2025: కొత్త టయోటా హిలక్స్ 2025 విడుదల.. మొదటి ఎలక్ట్రిక్ వెర్షన్ అందుబాటులోకి
సమాచారం ప్రకారం, ఆ గడియారం 14,190,000 స్విస్ ఫ్రాంక్‌లకు ($17.6 మిలియన్లు) అమ్ముడైంది. ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం ఆ సమయంలో అది పొందిన 11 మిలియన్ ఫ్రాంక్‌లు లేదా $11 మిలియన్ల కంటే ఎక్కువ. ఈ గడియారం 1943లో తయారు అయ్యిందని, దీనిని పాకెట్ ఫిలిప్ పెర్పెచువల్ క్యాలెండర్ రిఫరెన్స్ 1518 అని పిలుస్తారని AFP వార్తా సంస్థ నివేదించింది. ఈ మోడల్ మొత్తం 280 గడియారాలు తయారు చేశారు. కానీ నాలుగు మాత్రమే స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందించారు. మిగిలినవి బంగారంతో తయారు చేశారు.
Also Read:Foldable Phones: ఫోల్డబుల్ ఫోన్‌లు కొంటున్నారా?.. అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్‌లే ఎక్కువ!
బంగారంతో తయారు చేసిన ఇతర గడియారాల కంటే స్టీల్‌తో తయారు చేసిన గడియారానికే ఎక్కువ డిమాండ్ ఉందని చెబుతున్నారు. అందుకే ఈ గడియారం వేలంలో ప్రపంచంలోనే అత్యధిక, రికార్డు ధరకు అమ్ముడైంది. ఈ ఆదివారం వేలం వేసిన గడియారం స్టీల్‌తో తయారు చేసిన నాలుగు గడియారాలలో మొదటిదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ వారాంతంలో స్టీల్‌నెస్ స్టీల్ 1518 అమ్మకం ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత చారిత్రాత్మక చేతి గడియారాలలో ఒకటిగా దాని హోదాను పునరుద్ఘాటించిందని వేలం నిర్వాహకులు ఆదివారం తెలిపారు. వేలం కేవలం తొమ్మిది నిమిషాలు మాత్రమే పట్టిందని, ఐదుగురు బిడ్డర్లు పాల్గొన్నారని, చివరికి ఆ గడియారం టెలిఫోన్ బిడ్డర్‌కు అమ్ముడయిందని తెలుస్తోంది.