AP Govt: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అంతర్ జిల్లా బదిలీలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పౌజ్ గ్రౌండ్స్ ఆధారంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్‌కు అనుమతిస్తూ కొత్త గైడ్‌లైన్స్‌తో పాటు జీవోను రిలీజ్ చేసింది. ఈ ఆర్డర్లు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సచివాలయ సిబ్బందికి ఉపశమనం కలిగించనున్నాయి. అయితే, ఈ బదిలీలు పూర్తిగా ఉద్యోగుల స్వచ్ఛంద రిక్వెస్ట్ ఆధారంగా మాత్రమే అమలు కానున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలని వెల్లడించింది.
Read Also: Eatala Rajendar: కుంగిపోవద్దు, భవిష్యత్తు మనదే.. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితంపై ఈటల!
అయితే, ట్రాన్స్‌ఫర్లు రిక్వెస్ట్ బేసిస్ మీద మాత్రమే అర్హులు అని ఏపీ సర్కార్ తెలిపింది. హజ్‌బెండ్/ వైఫ్ ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలనే నిబంధన ఉంది. ప్రైవేట్ ఉద్యోగి అయితే స్పౌజ్ గ్రౌండ్స్ వర్తించదని పేర్కొనింది. ఇక,డిసిప్లినరీ లేదా ఏసీబీ కేసులు ఉన్నవారికి ట్రాన్స్‌ఫర్ కి అర్హత లేదన్నారు. అలాగే, నో డ్యూ్స్ సర్టిఫికేట్లు తప్పనిసరి చేసింది. మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీనియారిటీ లిస్టులు ఉండనున్నాయి.
Read Also: Enumamula Market: బోసిపోయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్.. అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు!
ట్రాన్స్‌ఫర్లకు కావాల్సిన డాక్యుమెంట్స్:
* మ్యారేజ్ సర్టిఫికేట్
*స్పౌజ్ ఉద్యోగ ధృవీకరణ & ఎంప్లాయ్ ఐడి.
ట్రాన్స్‌ఫర్ నిబంధనలు
* క్లియర్ వేకెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌ఫర్
* కొత్త జిల్లాలో చివరి ర్యాంక్ కేటాయింపు
* టై వచ్చినపుడు – సీనియారిటీ, తరువాత DOB ఆధారంగా ప్రాధాన్యం.
ప్రొసీజర్
* పోర్టల్ ద్వారా అప్లై
* ప్రొవిజనల్ సీనియారిటీ → ఆబ్జెక్షన్స్ → ఫైనల్ లిస్టు
* శాఖా సెక్రటరీలు ఇంటర్ డిస్ట్రిక్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు ఇస్తారు
* మండల్/ULB అలాట్ చేయడం → తరువాత కౌన్సిలింగ్‌లో సెక్రటేరియట్ అలాట్
ట్రాన్స్‌ఫర్ స్వయంకృత
* రిక్వెస్ట్ కనుక TTA/DA లేదు
* పూర్తి ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్: 30వ తేదీ నవంబర్ 2025 లోపు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది.