పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ తీరుకు నిరసనగా జిన్నింగ్ మిల్ వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారు. నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నమని వ్యాపారులు ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పత్తి క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దాంతో తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు క్రయవిక్రయాలు లేక బోసిపోయింది.
తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు క్రయవిక్రయాలు లేక బోసిపోయింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ తీరుతో రైతులు, జిన్నింగ్ మిల్లర్లు నష్టపోతున్నారంటూ కొన్ని రోజులుగా ఆందోళన బాటపట్టారు . సీసీఐ కొత్త నిబంధనలు కొర్రీలతో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిన్నింగ్ మిల్ వ్యాపారులు 17 సోమవారం నుంచి పత్తి కొనుగోళ్ల బంద్ చేస్తున్నామని పిలుపునిచ్చారు. జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు బంద్ పిలుపు నేపథ్యంలో రైతులు పత్తిని మార్కెట్‌కు తీసుకురాని పరిస్థితి నెలకొంది. దీంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బోసిపోయింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ప్రతిరోజు సుమారు 15 వేల బస్తాల పత్తి అమ్మకాలు జరుగుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 23 జిన్నింగ్ మిల్ యాజమాన్యాలు పత్తి కొనుగోలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు క్రయవిక్రయాలు కొనసాగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రతి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్ యాజమాన్యాలు బందుకు పిలుపునివ్వడంతో.. రైతులెవరు పత్తిని మార్కెట్కి తీసుకురాలేదు. దీంతో వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి యార్డ్ మొత్తం బోసిపోయింది. సీసీఐ వివరిస్తున్న తీరుకు రైతులకు జరుగుతున్న నష్టంతో పాటు మిల్లర్లకు జరుగుతున్న నష్టాన్ని రైతులకు తెలిసేలా చేయడం వల్లనే రైతులెవరు పత్తి యార్డుకి పత్తిని తీసుకు రాలేదని, దీంతో కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని సీసీఐ పెట్టిన నిబంధనలను తొలగించాల్సిన అవసరం ఉందని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు ముహూర్తం ఖరారు!
పత్తి రైతుల బాధలపై బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి వినయ్ భాస్కర్ లు ప్రశ్నించారు. మద్ధతు ధర రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే… మంత్రులు, ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని ఫైర్ అయ్యారు. రైతులకు మద్దతు ధర కోసం బీఆర్ఎస్ నిరసనకు దిగుతుందని వెల్లడించారు. ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సాయంత్రం వరకు పత్తి కొనుగోలు ప్రక్రియ పై సరైన నిర్ణయం తీసుకోకుంటే మంగళవారం నుంచి బిఆర్ఎస్ రైతుల పక్షాన ఆందోళన బాట పడుతుందని హెచ్చరించారు.
సీసీఐ వ్యవహారశైలి, మరోవైపు పత్తి వ్యాపారుల ఒత్తిడి నేపథ్యంలో పత్తి కొనుగోళ్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల్లో ఆందోళన నెలకొంది. చేనులో నుంచి తీసిన పత్తిని అమ్ముకోలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలు, చీడపీడలతో దిగుబడి రాక పెట్టుబడి అష్ట కష్టాలు పడుతున్న రైతులకు మరో సమస్య వచ్చి పడింది. ఆరుకాలం కష్టం చేసి తీసిన పత్తిని అమ్ముకోలేకపోయే దుస్థితిలో రైతులు ఉన్నారు. చేతికొచ్చిన పత్తి అమ్మితే కనీసం వేరే ఖర్చులు అయినా వెల్లుతాయని భావిస్తున్న అన్నదాతలు.. వ్యాపారులు, సీసీఐ మధ్య నలిగిపోతున్నారు.